అటు RRR, ఇటు KGF... ఐపీఎల్‌లో రెండు ఇండస్ట్రీ హిట్ల గొడవ! తెలుగు టీమ్ లేకపోయినా...

First Published Apr 17, 2023, 5:10 PM IST

భారత సినీ బాక్సాఫీస్ చరిత్రలో ‘RRR’, ‘KGF’ సృష్టించిన సునామీ అసాధారణం. టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చెక్కిన ‘RRR’ సినిమా, ఆస్కార్ వేదికపై అవార్డు సాధిస్తే, కన్నడలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘KGF 2’ రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టింది. ఒకే ఏడాదిలో విడుదలైన ఈ రెండు సినిమాల పేర్లతో, ఇప్పుడు ఐపీఎల్ 2023లో ఓ మినీ యుద్ధమే జరుగుతోంది...

‘RRR’ సినిమా టాలీవుడ్ బొమ్మ, ‘KGF’ కోలీవుడ్ బొమ్మ కాబట్టి.. మాహా అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ సమయంలో ‘RRR’ vs ‘KGF’ ట్రెండ్ అవ్వాలి. అయితే ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్ సమయంలో ఇది ట్రెండ్ అవుతుండడం విశేషం...

Image credit: PTI

ఎందుకంటే ఇక్కడ ‘RRR’, ‘KGF’ అంటే సినిమా పేర్లు కావు. ఆ జట్లలోని కీ ప్లేయర్లు.  చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో ‘RRR’ అంటే R- రుతురాజ్ గైక్వాడ్, R- రహానే, R- రవీంద్ర జడేజా. ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అదరగొడుతున్న ముగ్గురు కీ ప్లేయర్లు వీరే...

Latest Videos


యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సంచలన ఫామ్‌లో ఉంటే, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అనుకోకుండా టీమ్‌లోకి వచ్చి 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి, అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు రహానే. ఇక ఆర్‌సీబీతో మ్యాచ్ అంటే రవీంద్ర జడేజాకి పూనకాలు వచ్చేస్తాయి... కాబట్టి ఆర్‌సీబీ మెయిన్ టార్గెట్ ‘RRR’...

Image credit: PTI

ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ‘KGF’ అంటే K- కోహ్లీ, G- గ్లెన్ మ్యాక్స్‌వెల్, F- ఫాఫ్ డుప్లిసిస్. ఐపీఎల్ 2023 సీజన్‌లో 4 మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఫాఫ్ డుప్లిసిస్ కూడా అదరగొడుతున్నాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా అందిన కాడికి బాగానే ఆడుతున్నాడు...

PTI PhotoShailendra Bhojak)(PTI04_10_2023_000225B)

ఆర్‌సీబీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఈ ముగ్గురే కీలకం. ఇప్పటిదాకా పరుగులు చేసింది కూడా ఈ ముగ్గురే. దినేశ్ కార్తీక్, షాబజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రార్, అనుజ్ రావత్ వంటి ప్లేయర్లు వచ్చిన అవకాశాలు సరిగ్గా వాడుకోలేకపోయారు. కాబట్టి చెన్నై మెయిన్ టార్గెట్.. ఆర్‌సీబీలోని  ‘KGF’...

బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా ‘RRR’, ‘KGF’ సినిమాలను పోల్చి చూస్తే, రెండూ సూపర్ హిట్టే. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లో అలా కుదరదు. రెండు టీమ్స్‌లో ఒకే జట్టుకి విజయం దక్కుతుంది. మరి అటు ‘RRR’, ఇటు ‘KGF’లలో ఏ టీమ్ గెలుస్తుందో తెలియాలంటే మ్యాచ్ అయ్యేదాకా ఎదురుచూడాల్సిందే..  ‘RRR’ vs ‘KGF’ లో ధోనీ లేడు ఏంటి? అని చాలామంది ఈ ట్రెండ్ చేసేవాళ్లను ప్రశ్నిస్తున్నారు.

Image credit: PTI

అయితే ధోనీ, సీఎస్‌కే కెప్టెన్ అయినా బ్యాటర్‌గా అతను ఈ సీజన్‌లో చూపించిన ప్రభావం చాలా తక్కువ. ఆఖర్లో వచ్చిన రెండు మూడు సిక్సర్లు కొట్టి అవుట్ అవుతున్న ధోనీ... కీ ప్లేయర్‌ లెక్కలోకి రాడంటున్నారు ఆర్‌సీబీ ఫ్యాన్స్.. మాహీని పోటీలేకుండా వచ్చిన షారుక్ ‘పఠాన్’తో పోలుస్తున్నారు. 

click me!