ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్. వరుసగా ఐదుకి ఐదు మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, ప్లేఆఫ్స్ చేరాలంటే ఏదైనా ఊహించని అద్భుతం జరగాల్సిందే. ఢిల్లీ టీమ్ వరుస వైఫల్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి...
‘ఢిల్లీ క్యాపిటల్స్ ఇక కమ్‌బ్యాక్ ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్లు వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిపోయి, ఆఖరి నుంచి టాప్ 4లో కూడా చోటు కోల్పోయారు. మిగిలిన టీమ్స్ అన్నీ కనీసం రెండు మ్యాచులు గెలిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా బోణీ కొట్టలేదు...
26
Image credit: PTI
ఢిల్లీ డగౌట్‌లో ఉన్నవాళ్లకు ఓడిపోవడం తెలీదు. రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ, డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్.. అందరూ ఎన్నో విజయాలు అందుకున్నవాళ్లే. ప్రతీ టీమ్ ఓడిపోతుంది. ఓడిపోవడం తప్పే కాదు. అయితే ఓడుతున్న విధానమే అసలు సమస్య...
36
Image credit: Delhi Capitals
ఐదు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ బాగా ఆడిందని అనిపించలేదు. కనీస పోరాటం కూడా చూపించడం లేదు. చివరిదాకా పోరాడి ఓడిపోతే అనుకోవచ్చు కానీ ఢిల్లీ క్యాపిటల్స్, ప్రత్యర్థి చేతుల్లో చిత్తుగా ఓడుతోంది. ఇది ఏ మాత్రం మంచిది కాదు...
46
Image credit: PTI
బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, ఢిల్లీ క్యాపిటిల్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాక ఈజీగా గెలువచ్చని అనుకుని ఉంటాడు కానీ టీమ్ ఇలా ఆడుతుందని అస్సలు ఊహించి ఉండడు.
56
Image credit: PTI
బీసీసీఐ ప్రెసిడెంట్ పొజిషన్ నుంచి వచ్చిన తర్వాత ఇలా ఫెయిల్ అవుతున్న టీమ్‌లో ఉండడం దాదాకి నచ్చకపోవచ్చు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...
66
PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000300B)
తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో 50 పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతుల్లో 6 వికెట్ల తేడాతో ఓడింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో 57 పరుగుల తేడాతో ఓడి హ్యాట్రిక్ కొట్టిన ఢిల్లీ, ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఓడింది క్యాపిటల్స్..