చిన్నస్వామిలో బిగ్ ఫైట్.. ఆర్సీబీ - సీఎస్కే మ్యాచ్‌లో ఈ రికార్డులు బ్రేక్ అవుతాయా..?

First Published Apr 17, 2023, 5:02 PM IST

IPL 2023: ఐపీఎల్ - 16లో నేటి రాత్రి మరో ఆసక్తికర పోరు జరుగనుంది.  చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు) వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతున్నాయి. 

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అభిమానులు ఎంతో ఆసక్తిగా  చూసే మరో  పోరు ఆర్సీబీ - సీఎస్కే. భారత క్రికెట్ దిగ్గజాలు ధోని  - కోహ్లీల మధ్య పోరుగా  ఈ రెండు జట్ల అభిమానులు భావిస్తుంటారు.  

కాగా ఐపీఎల్ లో మోస్ట్  ఫ్యాన్ బేస్డ్ టీమ్స్ గా  ఉన్న ఈ రెండు జట్లూ  ఈ సీజన్ లో   తొలిసారి  తలపడుతున్నాయి.  ఈ నేపథ్యంలో ఇరు జట్ల  మధ్య  చిన్నస్వామి వేదికగా  బ్రేక్ అయ్యేందుకు కొన్ని రికార్డులు సిద్ధంగా ఉన్నాయి.  అవేంటో ఇక్కడ చూద్దాం. 

Latest Videos


ఈ మ్యాచ్ లో సీఎస్కే బౌలర్ రవీంద్ర జడేజా  రెండు వికెట్లు తీస్తే  అతడు ఆర్సీబీపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా  రికార్డు సృష్టిస్తాడు.   ఈ జాబితాలో హార్భజన్ సింగ్.. 27 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా జడ్డూ.. 26 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. బుమ్రా.. 24 వికెట్లు తీశాడు.   

నేటి పోరులో ధోని  రెండు పరుగులు చేస్తే  ఐపీఎల్ లో  ఆర్సీబీపై అత్యధిక పరుగులు చేసిన  బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుతాడు.  ఆర్సీబీపై  అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో  డేవిడ్ వార్నర్.. 839 పరుగులు చేశాడు.  ధోని  838 రన్స్ చేశాడు. రోహిత్ శర్మ.. 786 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. 

సీఎస్కేపై కోహ్లీకి ఘనమైన రికార్డు ఉంది.  ఈ మ్యాచ్ లో  కూడా  కోహ్లీ మరో ఏడు పరుగులు చేస్తే  చెన్నైపై  వెయ్యి పరుగులు చేసిన రెండో బ్యాటర్ అవుతాడు. ఈ జాబితాలో   శిఖర్ ధావన్ అందరికంటే ముందున్నాడు.  ధావన్ చెన్నైపై  1,077 రన్స్ చేశాడు.  కోహ్లీ.. 993 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్.. 823 పరుగులతో  మూడో స్థానంలో నిలిచాడు. 

ఇవాళ జరుగబోయే మ్యాచ్ లో  సీఎస్కే గనక గెలిస్తే ఒక ప్రత్యర్థిపై   అత్యధిక విజయాలు గెలిచిన  జట్టుగా ఉన్న  ముంబై రికార్డును సమం చేస్తుంది.  ముంబై.. చెన్నైపై  20 విజయాలు సాధించింది.  సీఎస్కేకు ఆర్సీబీపై 19 విజయాలున్నాయి. మొత్తంగా ఈ రెండు జట్లూ ఐపీఎల్ లో 30 మ్యాచ్ లలో తలపడగా  చెన్నై 19 సార్లు, ఆర్సీబీ 10 సార్లు గెలిచాయి. ఒక మ్యాచ్ లో ఫలితం  తేలలేదు. ఐపీఎల్ లో ఇలా ఒక జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన టీమ్ గా ముంబై ఇండియన్స్ ఉంది. ముంబైకి కోల్కతాపై 23 విజయాలున్నాయి. 

click me!