అర్జున్ టెండూల్కర్‌ వల్ల అది చేతకాకపోతే, ఇలా వాడొచ్చుగా... రోహిత్ శర్మకు సైమన్ ధుల్ సలహా...

Published : Apr 26, 2023, 10:38 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆరంగ్రేటం చేసిన సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్, ముంబై ఇండియన్స్ టీమ్‌కి ఎక్స్‌ట్రా ప్లేయర్‌గానే మారాడు. ఎందుకంటే ఇప్పటిదాకా అర్జున్ టెండూల్కర్ నాలుగు మ్యాచులు ఆడితే, మూడు మ్యాచుల్లో ఆరంభంలో 2 ఓవర్లు మాత్రమే వేసి సైడ్ అయిపోయాడు...

PREV
18
అర్జున్ టెండూల్కర్‌ వల్ల అది చేతకాకపోతే, ఇలా వాడొచ్చుగా... రోహిత్ శర్మకు సైమన్ ధుల్ సలహా...
PTI Photo/Kunal Patil)(PTI04_22_2023_000465B)

ఆరంభంలో రెండు ఓవర్లు బాగా వేస్తున్నాడని పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో అర్జున్ టెండూల్కర్‌కి బంతిని అందించాడు రోహిత్ శర్మ. ఆ ఓవర్‌లో సామ్ కుర్రాన్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా కలిసి సిక్సర్ల మోత మోగించి 31 పరుగులు రాబట్టారు...

28
PTI Photo) (PTI04_25_2023_000273B)

ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేయడానికి ఈ ఓవరే టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి 2 ఓవర్లలో 9 పరుగులే ఇచ్చినా అతనికి మళ్లీ బౌలింగ్ ఇచ్చే సాహసం చేయలేదు రోహిత్ శర్మ...

38
arjun tendulkar

ఓ బౌలర్‌ 2 ఓవర్లు మాత్రమే వేసి పక్కకు తప్పుకుంటే, అతని కోటా 2 ఓవర్లు వేసేందుకు మరో బౌలర్‌ని ఆడించాల్సి ఉంటుంది. ఇలా అర్జున్ టెండూల్కర్ హాఫ్ బౌలర్ ఇన్నింగ్స్ కారణంగా ఓ అదనపు బ్యాటర్‌ని ఆడించే అవకాశం కోల్పోతోందోంది ముంబై ఇండియన్స్..

48
PTI Photo) (PTI04_25_2023_000273B)

‘పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ తర్వాత అర్జున్ టెండూల్కర్‌ని తప్పిస్తారని అనుకున్నా, అయితే అతనికి మరో అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం. రోహిత్ శర్మకు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ గురించి పూర్తి ఐడియా వచ్చి ఉంటుంది...

58

అర్జున్ టెండూల్కర్ డెత్ ఓవర్ బౌలర్ కాదు. అతను చివరి ఓవర్లలో ప్రెషర్‌ని తట్టుకుంటూ బౌలర్ చేయలేదు. అయితే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అలాంటి ప్రయత్నం చేసిన రోహిత్ శర్మకు గట్టి షాక్ తగిలింది...

68
Arjun Tendulkar-Sachin Tendulkar

నా ఉద్దేశంలో అర్జున్ టెండూల్కర్, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయకపోతే పవర్ ప్లేలో పూర్తిగా వాడుకోవచ్చు కదా. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహార్‌ల బౌలింగ్ గమనిస్తే, ఈ ఇద్దరూ కూడా పవర్ ప్లేలో బౌలింగ్ అద్భుతంగా చేస్తారు. దీపక్ చాహార్ అయితే పవర్ ప్లేలోనే తన కోటా ముగిస్తాడు. మళ్లీ బౌలింగ్‌కి రాడు...

78
Image credit: PTI

అర్జున్ టెండూల్కర్‌కి ఇన్నింగ్స్ చివర్లో బౌలింగ్ చేసేందుకు కావాల్సినంత అనుభవం లేదు. కాబట్టి అతన్ని కూడా దీపక్ చాహార్‌లా పవర్ ప్లేలోనే 4 ఓవర్లు వేయిస్తే బెటర్.

88
Image credit: PTI

అలా చేయడం వల్ల అర్జున్ టెండూల్కర్ కోటాలోని 2 ఓవర్లు పూర్తి చేసేందుకు మరో బౌలర్‌ని ఆడించాల్సిన అవసరం ఉండదు...’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ ధుల్.. 

Read more Photos on
click me!

Recommended Stories