ఇక్కడే ఉన్నా! నిజాలు తెలియకుండా రాయకండి... గాయంపై జోఫ్రా ఆర్చర్ రియాక్షన్...

Published : Apr 26, 2023, 10:10 PM IST

ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.8 కోట్లు పెట్టి జోఫ్రా ఆర్చర్‌ని కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. ఆర్చర్‌ని కొనాలని ఫిక్స్ అయి వేలానికి వచ్చిన ముంబై టీమ్, ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డి కాక్ వంటి ప్లేయర్లను తిరిగి కొనుగోలు చేయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు...

PREV
17
ఇక్కడే ఉన్నా! నిజాలు తెలియకుండా రాయకండి... గాయంపై జోఫ్రా ఆర్చర్ రియాక్షన్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో జోఫ్రా ఆర్చర్ అందుబాటులో ఉండడని వేలంలో ముందుగానే ప్రకటించారు ఆక్షనర్. అయితే 2023 సీజన్‌లో వస్తాడు, అదరగొడతాడని ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకుని ఆర్చర్‌ని కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...
 

27

అనుకున్నట్టుగానే జస్ప్రిత్ బుమ్రా తప్ప మరో స్టార్ బౌలర్ లేకపోవడంతో ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 10 మ్యాచుల్లో ఓడి ఆఖరి స్థానంలో నిలిచింది ముంబై ఇండియన్స్.  అయితే 2023 సీజన్‌లో ఆర్చర్, బుమ్రా కలిసి ముంబైకి విజయాలు అందిస్తారని అనుకున్నారు ఫ్యాన్స్...

37
Jofra Archer

అయితే 2023 సీజన్‌కి ఆరు నెలల ముందే జస్ప్రిత్ బుమ్రా వెన్ను గాయంతో క్రికెట్‌కి దూరమయ్యాడు. జోఫ్రా ఆర్చర్ అయినా ఆదుకుంటాడని అనుకున్న ముంబై ఆశలు నెరవేరడం లేదు. ఇప్పటిదాకా 7 మ్యాచుల్లో కేవలం 2 మ్యాచులు మాత్రమే ఆడాడు జోఫ్రా ఆర్చర్...

47

ఆర్‌సీబీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించిన జోఫ్రా ఆర్చర్, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచులు ఆడలేదు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చి 4 ఓవర్లలో 42 పరుగులు సమర్పించిన జోఫ్రా ఆర్చర్, ఒకే ఒక్క వికెట్ తీశాడు...

57

తాజాగా జోఫ్రా ఆర్చర్ గాయంతో ముంబై ఇండియన్స్‌ క్యాంపుని వదిలి, బెల్జియం చేరుకున్నాడని ఇంగ్లీష్ పత్రిక ‘ది టెలిగ్రాఫ్’ రాసుకొచ్చింది. ఈ వార్త కొద్దిసేపట్లోనే ఇండియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వార్తపై స్పందించాడు జోఫ్రా ఆర్చర్...

67

‘నిజాలు తెలుసుకోకుండా, నా పరిస్థితి గురించి కూడా ఎలాంటి అవగాహన లేకుండా ఇలాంటి ఆర్టికల్స్ రావడం నిజంగా తిక్కే...  ఇది ఎవరు రాశారో కానీ ఆ రిపోర్టర్‌ సిగ్గు పడాలి. నీ ప్రయోజనం కోసం ఇప్పటికే గాయాలతో ఇబ్బంది పడుతున్న ప్లేయర్‌తో ఇబ్బందిపెడుతున్నావు. నీలాంటి వాళ్లే నిజమైన సమస్య’ అంటూ రాసుకొచ్చాడు జోఫ్రా ఆర్చర్...

77
Image credit: PTI

గుజరాత్ టైటాన్స్ చేతుల్లో 55 పరుగుల తేడాతో ఓడిన ముంబై ఇండియన్స్, తర్వాతి మ్యాచ్‌లో ఏప్రిల్ 30న రాజస్థాన్ రాయల్స్‌తో తలబడుతోంది. మొదటి 7 మ్యాచుల్లో 3 విజయాలు అందుకున్న ముంబై, ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 5 మ్యాచుల్లో గెలవాల్సి ఉంటుంది..

click me!

Recommended Stories