ఆ ఓవర్ దెబ్బకు అతనికి జ్వరం వచ్చింది, 8 కిలోల బరువు తగ్గాడు... యశ్ దయాల్‌పై హార్ధిక్ పాండ్యా...

Published : Apr 26, 2023, 07:51 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో సూపర్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ అంటే యశ్ దయాల్ ఓవర్‌లో రింకూ సింగ్ కొట్టిన 5 సిక్సర్లే. ఆఖరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు కావాల్సిన సమయంలో యశ్ దయాల్ వేసిన చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది మ్యాచ్‌ని ముగించాడు రింకూ సింగ్...

PREV
17
ఆ ఓవర్ దెబ్బకు అతనికి జ్వరం వచ్చింది, 8 కిలోల బరువు తగ్గాడు... యశ్ దయాల్‌పై హార్ధిక్ పాండ్యా...
yash dayal

రింకూ సింగ్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఆ మ్యాచ్ తర్వాత గుజరాత్ టైటాన్స్ నాలుగు మ్యాచులు ఆడినా ఒక్క మ్యాచ్‌లో కూడా యశ్ దయాల్ కనిపించలేదు...

27
Yash Dayal

ఒకే ఒక్క ఓవర్‌తో యశ్ దయాల్ మాయమైపోయాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత యశ్ దయాల్ గురించి హార్ధిక్ పాండ్యాకి ప్రశ్న ఎదురైంది..

37

‘ఈ సీజన్‌లో యశ్ దయాల్ మళ్లీ ఆడతాడా? లేదా? అనేది చెప్పలేను. ఎందుకంటే అతను ఆ మ్యాచ్ తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. రెండు వారాల్లో 7-8 కిలోల బరువు తగ్గిపోయాడు. ఆ మ్యాచ్‌ తర్వాత యశ్ తీవ్రమైన ప్రెషర్‌కి లోనయ్యాడు...
 

47

అదే సమయంలో అతనికి వైరల్ ఫివర్ కూడా వచ్చింది. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా చెడిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను మ్యాచ్ ఆడే అవకాశాలు లేవు. అయితే ఆటలో ఇవన్నీ సహజం. ఒకరి గెలిచినప్పుడు మరొకరు ఓడిపోవడం సహజం...

57
Image credit: PTI

అయితే అతను మళ్లీ క్రికెట్‌లోకి వస్తాడు. మరింత స్ట్రాంగ్‌గా రీఎంట్రీ ఇస్తాడు. కానీ దానికి చాలా సమయం పడుతుంది. అతనికి టీమ్ నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...

67

యశ్ దయాల్ ఆ ఓవర్ తర్వాత సీనియర్ బౌలర్ మోహిత్ శర్మను తుది జట్టులోకి తీసుకొచ్చింది గుజరాత్ టైటాన్స్. ఐపీఎల్ 2023 సీజన్‌లో తాను ఆడిన మొదటి మ్యాచ్‌లోనే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన మోహిత్ శర్మ, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసి 12 పరుగులు నిలువరించాడు...

77
PTI Photo) (PTI04_25_2023_000381B)

మోహిత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో 4 వికెట్లు కోల్పోయిన లక్నో సూపర్ కింగ్స్, 4 పరుగులు మాత్రమే చేసి 7 పరుగుల తేడాతో ఓడింది. సీజన్‌లో 4 మ్యాచులు ఆడిన మోహిత్ శర్మ, 6 వికెట్లు తీసి గుజరాత్ టైటాన్స్‌కి కీ బౌలర్‌గా మారాడు...

click me!

Recommended Stories