రామారావు, రొనాల్డో, రోహిత్ శర్మ... RRR కటౌట్ అదిరింది! ఆ లిస్టులో చేరిన హిట్ మ్యాన్...

Published : Apr 30, 2023, 04:28 PM ISTUpdated : Apr 30, 2023, 04:29 PM IST

క్రికెటర్లలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ల గురించి ప్రస్తావన వస్తే ముందుగా మాట్లాడుకునేది సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీల గురించే. అయితే ఈ ముగ్గురికీ సాధ్యం కానీ అరుదైన రికార్డును రోహిత్ శర్మ సొంతం చేసుకున్నాడు...

PREV
16
రామారావు, రొనాల్డో, రోహిత్ శర్మ... RRR కటౌట్ అదిరింది! ఆ లిస్టులో చేరిన హిట్ మ్యాన్...

నిన్నటి తరానికి సచిన్ టెండూల్కర్ ఆరాధ్య దైవం అయితే, మాస్ ఫాలోయింగ్ విషయంలో మహేంద్ర సింగ్ ధోనీని కొట్టేవారు లేరు. ఇక సోషల్ మీడియా ఫాలోయింగ్‌లో కోహ్లీయే కింగ్. అయితే ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మకు తెలుగురాష్ట్రాలో, మహారాష్ట్రలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది...

26

రోహిత్ శర్మ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో సుదర్శన్ 35MM థియేటర్ ముందు 60 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ థియేటర్‌లో అఖిల్ అక్కినేని నటించిన ‘ఏజెంట్’ సినిమా ఆడుతోంది...

36

‘ఏజెంట్’ సినిమాకి ఇప్పటికే నెగిటివ్ టాక్ రావడంతో థియేటర్ల దగ్గర జనాలు కనిపించడం లేదు. అయితే సుదర్శన్ 35ఎంఎం థియేటర్ దగ్గర రోహిత్ శర్మ కటౌట్ చూసేందుకు చాలా మంది అభిమానులు తరలివచ్చారు. రోహిత్ భారీ కటౌట్‌కి పాలాభిషేకం చేసి అభిమానాన్ని, కాస్త వెర్రిని చాటుకున్న అభిమానులు, కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేశారు...
 

46

ఈ భారీ కటౌట్‌తో రోహిత్ శర్మ, ఓ అరుదైన జాబితాలో చేరాడు. భారత దేశంలో ఓ క్రికెటర్‌కి 60 అడుగుల కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి. అయితే సినిమాల హీరోల విషయంలో ఎన్టీఆర్ జూనియర్ టాప్‌లో ఉన్నాడు...

56

ఎన్టీఆర్ కోసం ఆయన అభిమానుల 120 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఇదే రికార్డు. అలాగే ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకి 120 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు సాకర్ ఫ్యాన్స్...

66

ఇప్పుడు క్రికెటర్లలో భారీ కటౌట్ పొందిన రోహిత్ ఈ లిస్టులో చేరారు. యాదృచ్ఛికంగా ఈ భారీ కటౌట్ పొందిన ముగ్గురి పేర్లలో కూడా రామారావు, రొనాల్డో, రోహిత్ (RRR) ఉండడం విశేషం.. 

Read more Photos on
click me!

Recommended Stories