వార్నర్ వేస్ట్.. అతడిని ఢిల్లీ కెప్టెన్‌గా తప్పించడమే బెటర్.. హర్భజన్ షాకింగ్ కామెంట్స్

Published : Apr 30, 2023, 03:50 PM IST

IPL 2023: ఐపీఎల్ -16 లో ఢిల్లీ క్యాపిటల్స్ ను నడిపిస్తున్న  డేవిడ్ వార్నర్ కెప్టన్ గా పనికిరాడని అంటున్నాడు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.

PREV
16
వార్నర్ వేస్ట్.. అతడిని ఢిల్లీ  కెప్టెన్‌గా తప్పించడమే బెటర్.. హర్భజన్ షాకింగ్ కామెంట్స్

ఐపీఎల్ - 2023 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఏదీ కలిసిరావడం లేదు.  ఈ  ఎడిషన్ లో  ఢిల్లీ 8 మ్యాచ్ లు ఆడితే ఆరు మ్యాచ్ లలో ఓడింది.   బ్యాటింగ్ వైఫల్యాలు ఆ జట్టును దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వరుసగా ఐదు మ్యాచ్ ల ఓటమి తర్వత  రెండు మ్యాచ్ లు గెలిచి  టచ్ లోకి వచ్చినట్టే కనిపించిన ఢిల్లీ.. మళ్లీ  శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో  ఓడింది. 

26
Image credit: PTI

ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఓడిన తర్వాత   హర్భజన్ సింగ్ తన యూట్యూబ్ లో మాట్లాడుతూ వార్నర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  వార్నర్  కెప్టెన్ గా  విఫలమవుతున్నాడని, అతడిని తప్పించి  అక్షర్ పటేల్ ను  సారథిగా నియమించాలని  అన్నాడు. 

36
Image credit: Getty

భజ్జీ మాట్లాడుతూ..  వార్నర్ జట్టును నడిపించడంలో విఫలమవుతున్నాడని, బ్యాటర్ గా రాణిస్తున్నా కెప్టెన్ గా మాత్రం  అతడు  సక్సెస్ కావడం లేదని వాపోయాడు. అక్షర్ పటేల్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణిస్తున్నాడని, అక్షర్ లో కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయని చెప్పాడు. 

46
Image credit: PTI

కాగా ఢిల్లీ క్యాపిటల్స్ కు డేవిడ్ వార్నర్ సారథి కాగా అక్షర్ పటేల్  అతడికి డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడు.   ఇప్పటికైతే ఢిల్లీ క్యాపిటల్స్  లో కెప్టెన్సీ మార్పు ఉండకపోవచ్చు. వాస్తవానికి ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్ గాయంతో  ఢిల్లీ వార్నర్ కు బాధ్యతలు అప్పజెప్పింది.  అయితే 8 మ్యాచ్ లలో వార్నర్.. రెండింటిలోనే గెలిపించాడు.  మరో మ్యాచ్ గనక ఓడితే ఇక ఈ  సీజన్ నుంచి ఢిల్లీ అధికారికంగా నిష్క్రమించినట్టే అవుతుంది. 

56

ఈ నేపథ్యంలో ఢిల్లీ మేనేజ్మెంట్ కెప్టెన్సీ మార్పునకు ఓకే చెబుతుందా..? అన్నది అనుమానమే.   కానీ వార్నర్ ను ఉన్నఫళంగా కెప్టెన్సీ నుంచి  తొలగించిన సందర్భం గతంలో కూడా ఉంది.  2021 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్.. వార్నర్ ను తప్పించి కేన్ విలియమ్సన్ ను  సారథిగా నియమించింది. 

66
Image credit: PTI

ఇక 8 మ్యాచ్ లలో రెండు మాత్రమే గెలిచి  పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఢిల్లీ.. మే 2న గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.   ఈ మ్యాచ్ లో కూడా ఓడితే ఢిల్లీ సంగతి అస్సామే. 

click me!

Recommended Stories