సేమ్ మ్యాచ్‌లు.. సేమ్ రన్స్.. సేమ్ యావరేజ్.. ఏకతాటిపై నిలవడమంటే ఇదేనేమో..! కోహ్లీ - గిల్‌ కేక

Published : Apr 30, 2023, 04:19 PM IST

IPL 2023:  ఐపీఎల్ -16లో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. టీమిండియా  పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. భావి భారత స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఏకతాటిపై నడుస్తున్నారు.. 

PREV
16
సేమ్ మ్యాచ్‌లు.. సేమ్ రన్స్.. సేమ్ యావరేజ్.. ఏకతాటిపై నిలవడమంటే ఇదేనేమో..! కోహ్లీ - గిల్‌ కేక
Image credit: PTI

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు  విరాట్ కోహ్లీ, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ లు అరుదైన  దృశ్యానికి సాక్ష్యంగా నిలిచారు. ఈ ఇద్దరూ  ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లు, చేసిన పరుగులు, ఎదుర్కున్న బంతులు,  యావరేజీ.. ఇలా అన్నీ అచ్చు గుద్దినట్టు సేమ్ టు సేమ్ మ్యాచ్ అయ్యాయి. 

26

ఇప్పటివరకు ఐపీఎల్ -16 లో కోహ్లీ 8 మ్యాచ్ లు ఆడాడు. 8 ఇన్నింగ్స్ లలోనూ బ్యాటింగ్ చేసి 333 పరుగులు సాధించాడు.  ఈ క్రమంలో కోహ్లీ 234 బంతులు ఎదుర్కున్నాడు. 

36

8 మ్యాచ్ లలో కోహ్లీ ఒకసారి డకౌట్ అయ్యాడు.  కోహ్లీ స్ట్రైక్ రేట్  142.30గా ఉంది.  అచ్చుగుద్దినట్టు ఇవే గణాంకాలు టీమిండియా యువ ఓపెనర్ గిల్ పేరిట కూడా నమోదయ్యాయి. నిన్న కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ తర్వాత  గిల్ గణాంకాలు కోహ్లీతో  సరిపోల్చి చూస్తే సేమ్ టు సేమ్ ఉన్నాయి. 

46
Image credit: PTI

గిల్ కూడా ఐపీఎల్ -16లో 8 మ్యాచ్ లు ఆడాడు.  8 ఇన్నింగ్సే్ లో ఒకసారి డకౌట్ అయ్యాడు.  కోహ్లీ మాదిరిగానే 234 బంతులు ఎదుర్కుని 333 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడి స్ట్రైక్ రేట్ కూడా 142.30 గా ఉండటం విశేషం.  ఇలా జరగడం చాలా అరుదు. 

56

అయితే ఇద్దరూ సమానంగా ఉన్నా   అత్యధిక  పరుగులు సాధించిన ఆటగాళ్లలో మాత్రం ఈ ఇద్దరూ  4,5 స్థానాలలో నిలిచారు.   వాస్తవానికి సగటు కూడా గిల్ కంటే  కోహ్లీదే ఎక్కువుంది. కోహ్లీ సగటు 47.57 గా ఉండగా  గిల్ సగటు 41.62గా ఉంది.  కోహ్ల ఐదు ఫిఫ్టీలు చేస్తే  గిల్ మూడే చేశాడు. 

66
Image credit: PTI

మరి సీజన్ ముగిసేవరకు ఈ ఇద్దరూ ఇవే గణాంకాలను మెయింటెన్ చేస్తే అది కొత్త చరిత్రకు పునాధి వేసినట్టే. ప్రస్తుతం టీమిండియాలో గిల్.. కోహ్లీ వారసుడిగా ఎదుగుతున్నాడు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడం, ఇద్దరూ కలిసి  భారీ  స్కోర్లు చేస్తూ భారత జట్టుకు విజయాలు అందిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories