ధోనీ కంటే రోహిత్ డేంజరస్ బ్యాటర్! అయితే గత మూడేళ్లలో... హర్భజన్ సింగ్ కామెంట్స్..

First Published Apr 29, 2023, 4:29 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండూ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. 15 సీజన్లలో 9 టైటిల్స్ కైవసం చేసుకుని మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్‌గా ఉన్న సీఎస్‌కే, ముంబై... రెండూ కూడా 14 మ్యాచుల్లో 10 పరాజయాలు చవిచూశాయి...

ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో ప్లేఆఫ్స్ దిశగా దూసుకుపోతుంటే, ముంబై ఇండియన్స్ కథ మాత్రం ఈ సీజన్‌లో కూడా ఏ మాత్రం మారనట్టే కనిపిస్తోంది...

7 మ్యాచుల్లో 3 విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన 7 మ్యాచుల్లో కనీసం 5 మ్యాచులు గెలవాలి. ఫస్టాఫ్‌లో ఆ టీమ్ పర్ఫామెన్స్‌ని బట్టి చూస్తే అది కష్టమే...

Latest Videos


ముఖ్యంగా రోహిత్ శర్మ కూడా ఈ సీజన్‌లో పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. సునీల్ గవాస్కర్ కూడా రోహిత్ ఇబ్బందిని చూసి, అతను మిగిలిన మ్యాచుల్లో ఆడకుండా రెస్ట్ తీసుకుని, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై దృష్టి పెడితే బాగుంటుందని చెప్పాడు..

ఐపీఎల్‌లో రోహిత్, ధోనీ కెప్టెన్సీలో ఆడిన ప్లేయర్లలో హర్భజన్ సింగ్ ఒకడు. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్ తరుపున ఆడిన అతికొద్ది మంది ప్లేయర్లలో భజ్జీ ఒకడు. 

‘రోహిత్ చాలా డేంజరస్ బ్యాటర్. అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం. రోహిత్ ఊపుమీదుంటే ఆపడం ఏ బౌలర్ వల్ల కాదు. ఎందుకంటే ఫామ్‌లో ఉంటే స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు అనే తేడా లేకుండా కొట్టి వదిలిపెడతాడు.

నా వరకూ భారత బ్యాటర్లలో మోస్ట్ డేంజరస్ బ్యాటర్లలో రోహిత్ శర్మ ఒకడు. అతనికి బౌలింగ్ చేయడాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేశా. అతని వీక్‌నెస్ కనుక్కోవడానికి నాకు చాలా సమయమే పట్టింది..

PTI PhotoShailendra Bhojak)(PTI04_17_2023_000308B)

నేను ధోనీకి ఎక్కువ బౌలింగ్ చేయలేదు. ఎందుకంటే ధోనీ బ్యాటింగ్‌కి వచ్చేసరికి నా బౌలింగ్ స్పెల్స్ అయిపోయేవి. మాహీ డెత్ ఓవర్లలో బ్యాటింగ్‌కి వస్తాడు. స్పిన్నర్లకు ఆ ఓవర్లు దొరకడమే చాలా కష్టం..

Image credit: PTI

అయితే అవకాశం వచ్చినప్పుడు ధోనీపై నేను పైచేయి సాధించా. చాలాసార్లు ధోనీని అవుట్ చేశా... అయితే మూడేళ్లుగా ధోనీ బ్యాటింగ్ చాలా మెరుగైంది. అతను చాలా డేంజరస్ బ్యాటర్‌గా తయారయ్యాడు.

రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్‌గా మారాక స్లో అయ్యాడు. అలాగే ధోనీ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాక బ్యాటింగ్‌పై చాలా ఫోకస్ పెట్టాడు. ఈ ఇద్దరి కెప్టెన్సీలో ఆడడం బాగా ఎంజాయ్ చేశా... ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.

click me!