136 కొట్టనోళ్లు సెకండ్ హయ్యస్ట్ స్కోరు కొట్టారు.. ఐపీఎల్‌లో లక్నో సరికొత్త రికార్డు..

Published : Apr 28, 2023, 10:08 PM IST

IPL 2023, PBKS vs LSG: ఐపీఎల్ లో  గతేడాది ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్  జెయింట్స్  పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో  దుమ్మురేపింది.  ఆ జట్టు ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదుచేసింది. 

PREV
17
136 కొట్టనోళ్లు సెకండ్ హయ్యస్ట్ స్కోరు కొట్టారు.. ఐపీఎల్‌లో లక్నో సరికొత్త రికార్డు..

ఐపీఎల్ లో  లక్నో  సూపర్ జెయింట్స్ చరిత్ర సృష్టించింది.  పలు రికార్డుల దుమ్ము దులుపుతూ ఈ లీగ్ లో అత్యధిక  స్కోరు సాధించిన రెండో టీమ్‌గా నిలిచింది.  పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో   కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో..  20 ఓవర్లలో   ఐదు వికెట్ల నష్టానికి  257 పరుగులు చేసింది. ఈ క్రమంలో  ఆర్సీబీ తర్వాత  అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. 

27
Image credit: Getty

ఐపీఎల్ లో ఆర్సీబీ  2013లో ఏప్రిల్ 23న  పూణె వారియర్స్ పై   నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి  263 పరుగులు చేసింది.  ఈ మ్యాచ్ లోనే క్రిస్ గేల్.. 175 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఈ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.

37

తాజాగా  లక్నో..  ఆర్సీబీ రికార్డుకు దగ్గరగా వచ్చింది. మొహాలీలో పంజాబ్ బౌలర్లను   సాకిరేవు దగ్గర బండకేసి బాదినట్టు బాదింది.  కైల్ మేయర్స్ (24 బంతుల్లో 54, 7 ఫోర్లు, 4 సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్ (40 బంతుల్లో 72, 6 ఫోర్లు, 5 సిక్సర్లు), అయుష్ బదోని  (24 బంతుల్లో 43, 3 ఫోర్లు, 3 సిక్సర్లు),  నికోలస్ పూరన్ (19 బంతుల్లో 45, 7 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగారు.

47
Marcus Stoinis

లక్నో బ్యాటర్ల బాదుడుతో 20 ఓవర్లలో  ఆ జట్టు  257 రన్స్ చేసింది. ఆర్సీబీ హయ్యస్ట్ స్టోరుకు ఆరు పరుగుల దూరంలో నిలిచింది.  స్టోయినిస్ గనక మరో ఓవర్ ఉండి ఉంటే ఆర్సీబీ  హయ్యస్ట్ స్కోరు రికార్డు కచ్చితంగా బ్రేక్ అయ్యుండేది. కాగా ఇదే లక్నో జట్టు ఈనెల 23న లక్నో వేదికగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో 136 పరుగులు కొట్టలేక చతికిలపడిన విషయం తెలసిందే.

57

ఇక ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన  జట్టుగా  ఉన్న టీమ్స్ ఇవే.. ఆర్సీబీ (263), లక్నో (257), ఆర్సీబీ (248), సీఎస్కే (246), కేకేఆర్ (245), సీఎస్కే (240), ఆర్సీబీ (235), సీఎస్కే (235). ఇందులో ఆర్సీబీనే నాలుగు సార్లు 230 ప్లస్ స్కోర్లు చేయడం గమనార్హం.

67
Chris Gayle

అత్యధిక పరుగుల జాబితాలోనే గాక ఈ మ్యాచ్ ద్వారా లక్నో మరో రికార్డు కూడా అందుకుంది.  ఒక ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక  బౌండరీలు, సిక్సర్లు సాధించిన టీమ్ గా కూడా   లక్నో  రెండో స్థానంలో నిలిచింది.   ఈ జాబితాలో ఆర్సీబీ.. పూణె వారియర్స్ తో మ్యాచ్ లో బౌండరీ కౌంట్ 42  (21 ఫోర్లు, 21 సిక్సర్లు)  గా నమోదయ్యింది.

77
Image credit: PTI

తాజా మ్యాచ్ లో  లక్నో కూడా  బౌండరీ కౌంట్ ను 41గా నమోదు చేసింది.  లక్నో ఇన్నింగ్స్ లో  27 బౌండరీలు, 14 సిక్సర్లు నమోదయ్యి. ఈ క్రమంలో రాహుల్ సేన..  ఎంఐ (38)  కేకేఆర్  రికార్డు (39) ల రికార్డులను  బ్రేక్ చేసింది.

click me!

Recommended Stories