ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒకే రోజు అంపైర్లు ఇచ్చిన మూడు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. పంజాబ్ కింగ్స్, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌లో జితేశ్ శర్మ అవుట్ విషయంలో వివాదం రేగగా ముంబైతో మ్యాచ్‌లో రెండు వివాదాలు రేగాయి...
బర్త్ డే రోజున ఐపీఎల్‌లో ఎప్పుడూ 20 పరుగులు కూడా చేయలేకపోయాడు రోహిత్ శర్మ. 2009లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరుపున పుట్టినరోజున జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. ఇప్పటికీ రోహిత్ బర్త్ డేన అదే అత్యధిక స్కోరు..
26
2014లో 5 బంతులాడి 1 పరుగు చేసిన రోహిత్ శర్మ, 2022లో 5 బంతులాడి 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నేటి మ్యాచ్‌లో 5 బంతులాడి 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...
36
ROHIT SHARMA
అయితే రోహిత్ శర్మ అవుట్ విషయంలో వివాదం రేగింది. సందీప్ శర్మ బౌలింగ్‌లో రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆఫ్ స్టంప్ కంటే ముందు లెగ్ స్టంప్ పైన బెయిల్ లైట్ రావడంతో సంజూ శాంసన్ గ్లవ్స్ తాకడం వల్లే బెయిల్స్ లేచాయని, రోహిత్ బౌల్డ్ కాలేదని వాదిస్తున్నారు కొందరు హిట్ మ్యాన్ ఫ్యాన్స్..
46
Image credit: PTI
అయితే వీడియలో క్లియర్‌గా గమనిస్తే సందీప్ శర్మ వేసి బాల్, ఆఫ్ స్టంప్ బెయిల్‌ని తాకుతూ వెళ్లింది. ఆఫ్ స్టంప్ బెయిల్ లేచేసరికి లెగ్ స్టంప్ బెయిల్ కదిలి ముందుగా లైట్ వచ్చింది. అదీకాకుండా సంజూ శాంసన్ గ్లవ్స్‌కి బెయిల్స్‌కి చాలా గ్యాప్ ఉంది. కాబట్టి అతని గ్లవ్స్ తాకి వికెట్లు కదలలేదు...
56
దీనికి ముందు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగులు చేసి అర్షద్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే టీవీ రిప్లైలో బంతి, నడుముపైకి వస్తున్నట్టు క్లియర్‌గా కనిపించింది.
66
రూల్స్ ప్రకారం బ్యాటర్ నడుము పైకి వస్తూ, బెయిల్స్ కంటే పైకి వెళ్లిన బాల్‌ని నో బాల్‌గా ప్రకటించాలి. అయితే రోహిత్ శర్మ, అంపైర్లతో ఏదో మాట్లాడడం ఆ తర్వాత థర్డ్ అంపైర్, ఆ బాల్‌ని కరెక్ట్ బాల్‌గా ప్రకటించడం జరిగిపోయాయి. దీంతో యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు...