వార్నర్ భాయ్, రషీద్ ఖాన్, కేన్ మామ... మ్యాచ్ విన్నర్లను పక్కనబెట్టేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

Published : Nov 16, 2022, 10:39 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌కి రిటెన్షన్ ప్రక్రియ పూర్తయ్యింది. వచ్చే సీజన్ కోసం కావాల్సిన ప్లేయర్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంఛైజీలు, అవసరం లేని ప్లేయర్లను వేలానికి విడుదల చేశాయి. 2023 సీజన్‌ మినీ వేలంలో అత్యధికంగా రూ.42.25 కోట్ల పర్సుతో పాల్గొనబోతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్...  ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు రూ.14 కోట్లతో అట్టిపెట్టుకున్న కెప్టెన్ కేన్ విలియంసన్‌ని కూడా మినీ వేలానికి విడుదల చేసింది ఆరెంజ్ ఆర్మీ...

PREV
17
వార్నర్ భాయ్, రషీద్ ఖాన్, కేన్ మామ... మ్యాచ్ విన్నర్లను పక్కనబెట్టేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

పేరుకి హైదరాబాద్ టీమ్ అయినా సన్‌రైజర్స్‌లో తెలుగు ప్లేయర్లు కనిపించింది తక్కువ. 2008లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ జట్టులో వీవీఎస్ లక్ష్మణ్, ఓజా, వేణుగోపాల్ వంటి తెలుగు ప్లేయర్లు ఉండేవారు. అయితే సీజన్లు మారే కొద్ది, హైదరాబాద్ టీమ్‌లో తెలుగు ప్లేయర్లు కనిపించకుండా పోయారు...

27

అయితే డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్, రషీద్ ఖాన్ వంటి ప్లేయర్లు తెలుగువారికి బాగా దగ్గరయ్యారు. డేవిడ్ భాయ్, కేన్ మామ, రషీద్ కాక అంటూ వీరిని దగ్గర చేసుకున్నారు తెలుగువాళ్లు. అయితే 2021 సీజన్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాభవ్యం కోల్పోయింది...

37

మనీశ్ పాండే సెలక్షన్ గురించి డేవిడ్ వార్నర్, మేనేజ్‌మెంట్‌పై చేసిన వ్యాఖ్యలు... అతను జట్టు నుంచి బయటికి వెళ్లేదాకా వెళ్లాయి. డేవిడ్ వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించిన టీమ్‌ మేనేజ్‌మెంట్, ఆ తర్వాత అతన్ని తుది జట్టులో కూడా లేకుండా చేసింది...

47

వరుసగా ఐదు సీజన్లలో 500+ పరుగులు చేస్తూ సన్‌రైజర్స్ బ్యాటింగ్ భారాన్ని మోసిన డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా 2016లో టైటిల్ కూడా గెలిచాడు. అయితే వార్నర్‌ని అవమానించి, జట్టు నుంచి బయటికి పంపించింది ఆరెంజ్ ఆర్మీ... ఈ సంఘటనతోనే సన్‌రైజర్స్‌కి అంతో కొంతో ఉన్న ఫాలోయింగ్ తగ్గింది...

57

అయితే 2018లో టీమ్‌ని ఫైనల్ చేర్చిన కేన్ విలియంసన్‌కి కెప్టెన్సీ అప్పగించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, అతన్ని రూ.14 కోట్లకు రిటైన్ చేసుకుంది. జట్టులో కీలక స్పిన్నర్‌గా ఉంటూ వచ్చిన రషీద్ ఖాన్ రూ.12 కోట్లకు పైగా డిమాండ్ చేయడంతో అతన్ని వేలానికి వదిలేసింది...

67

2022 సీజన్‌లో కెప్టెన్ కేన్ విలియంసన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. బ్యాటర్‌గానూ, కెప్టెన్‌గానూ మెప్పించలేకపోయాడు. దీంతో అతన్ని కూడా వేలానికి విడుదల చేసేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 2020 నుంచి 2022 మధ్య మూడేళ్లలో ముగ్గురు మ్యాచ్ విన్నర్లను వదులుకుంది ఆరెంజ్ ఆర్మీ...

77

2023 మినీ వేలంలో కేన్ విలియంసన్‌ని తిరిగి కొనుగోలు చేయడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. దీంతో కేన్ మామ, వార్నర్ భాయ్, రషీద్ కాక లేకుండా వచ్చే సీజన్‌లో ఆడబోతోంది కావ్య పాప టీమ్... అయితే టీమ్ మేనేజ్‌మెంట్ చేస్తున్న పనులు, ఎస్‌ఆర్‌హెచ్‌కి ఉన్న కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్‌ని కూడా దెబ్బ తీస్తున్నాయి...
 

click me!

Recommended Stories