పుట్టిన రోజని విష్ చేసిన షోయభ్ మాలిక్.. అస్సలు పట్టించుకోని సానియా మీర్జా.. అసలేం జరుగుతోంది..?

Published : Nov 15, 2022, 06:14 PM IST

Sania Mirza-Shoaib Malik: శత్రుదేశాల మధ్య వైరం సాగుతున్నా ఏరికోరి పాకిస్తాన్  క్రికెటర్ షోయభ్ మాలిక్ ను వివాహం చేసుకున్న భారత టెన్నిస్  స్టార్ సానియా మీర్జా బంధం విడాకులకు దారి తీస్తున్నది..!!

PREV
16
పుట్టిన రోజని విష్ చేసిన షోయభ్ మాలిక్.. అస్సలు పట్టించుకోని సానియా మీర్జా.. అసలేం జరుగుతోంది..?

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నేడు  తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నది. కొద్దిరోజులుగా తన భర్త షోయభ్ మాలిక్ తో ఆమె ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నదని, ఈ ఇద్దరూ త్వరలోనే విడాకులు  తీసుకోవడం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో  సానియా  బర్త్ డే ప్రాధాన్యం సంతరించుకుంది.

26

తాజాగా ఆమె తన బర్త్ డే సందర్భంగా సానియా.. బాలీవుడ్ దర్శకురాలు ఫరా  ఖాన్, తల్లి నసీమ్  ఖాన్ (ఆమె పుట్టినరోజు కూడా  ఇవాళే),  అనన్య బిర్లాలతో పాటు పలువురు ప్రముఖుల మధ్య పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది.  సానియా కేక్ కట్ చేస్తున్న వీడియోను  తన  ఇన్ స్టా ఖాతాలో పంచుకుంది. 

36

అయితే ఇవాళ ఉదయం సానియాకు భర్త షోయభ్ మాలిక్ నుంచి మెసేజ్ వచ్చింది.  ట్విటర్ ద్వారా స్పందించిన షోయభ్.. ‘హ్యాపీ బర్త్  డే టు సానియా మీర్జా. ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించు. ఈ రోజును   హ్యాపీగా అనుభవించు..’ అని ట్వీట్ చేశాడు.
 

46

అయితే ఈ ట్వీట్ కు   సానియా మీర్జా నుంచి ఎటువంటి స్పందనా లేదు.  మెసేజ్ కు రిప్లే ఇవ్వడం గానీ, లైక్ కొట్టడమో, లవ్ సింబల్ పెట్టడమో కూడా చేయలేదు. దీంతో ఇరువురి అభిమానులు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
 

56

షోయభ్  ట్వీట్ చేసిన తర్వాత  ట్విటర్ లో  పలువురు స్పందిస్తూ.. ‘హమ్మయ్యా.. ఇక మీరు కలిసినట్టేగా..?  విడాకుల రూమర్స్ కు చెక్ పడ్డట్టేగా..?  మీరెప్పుడూ ఇలాగే కలిసుండాలి..’ అని కామెంట్స్ చేస్తున్నారు.  అయితే మరికొందరు  మాత్రం   సానియా రిప్లై ఇవ్వకపోయేసరికి ‘డివోర్స్ పక్కా..’ అని  గుసగుసలాడుకుంటున్నారు. 

66

ఇదిలాఉండగా..సానియా మీర్జా- షోయబ్ మాలిక్ కలిసి త్వరలో ఓ టీవీ టాక్ షో నిర్వహించబోతున్నారు. ‘ది మీర్జా మాలిక్ షో’ పేరుతో ఊర్దూఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఈ షో ను ప్రకటించింది. ఈ టాక్ షోకి పాపులారిటీ, క్రేజ్ తెచ్చేందుకు మీర్జా మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్‌ పుట్టించినట్టూ వార్తలు వినిపించాయి.

click me!

Recommended Stories