ఐపీఎల్‌లో బాగా ఆడితే చాలు, టీమిండియాకి సెలక్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు దేశవాళీ టోర్నీల్లో ప్రదర్శన, టీమిండియా సెలక్షన్‌కి ఏ మాత్రం కొలమానం కాదు. దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతూ రికార్డుల మోత మోగిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌ని, సెలక్టర్లు మరోసారి పట్టించుకోకపోవడంతో ఐపీఎల్ ఒక్కటే మెయిన్‌గా మారిందని తేలిపోయింది..
ఐపీఎల్ 2023 సీజన్‌లో అనుకోకుండా తుది జట్టులోకి వచ్చిన అజింకా రహానే, చెన్నై సూపర్ కింగ్స్‌కి మ్యాచ్ విన్నర్‌గా మారాడు. రెండు సూపర్ ఫాస్ట్ హాఫ్ సెంచరీలతో, టెస్టు టీమ్‌లోకి ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు...
29
Wriddhiman Saha-Ishan Kishan
అయితే ఐపీఎల్ 2023 సీజన్‌లో బాగా ఆడుతున్న వృద్ధిమాన్ సాహాని కూడా సెలక్టర్లు పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. 11 మ్యాచుల్లో 27.3 యావరేజ్‌తో 137.9 స్ట్రైయిక్ రేటుతో 273 పరుగులు చేశాడు వృద్ధిమాన్ సాహా...
39
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, గుజరాత్ టైటాన్స్ 227 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌పై విరాట్ కోహ్లీ కూడా స్పందించడం హాట్ టాపిక్ అయ్యింది..
49
PTI Photo) (PTI05_07_2023_000160B)
ఈ ఇన్నింగ్స్ తర్వాత వృద్ధిమాన్ సాహాకి మరోసారి భారత టెస్టు టీమ్‌లో ఛాన్స్ రావొచ్చని భావించారంతా. అయితే సెలక్టర్లు మాత్రం సాహాని పట్టించుకోలేదు. దీనికి కారణం న్యూజిలాండ్‌తో సిరీస్ తర్వాత వృద్ధిమాన్ సాహా, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే, ఇషాంత్ శర్మలను పక్కనబట్టేసింది బీసీసీఐ...
59
PTI Photo/Kunal Patil)(PTI03_31_2023_000264B)
వీరిలో ఛతేశ్వర్ పూజారా, కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022లో 1000+ పరుగులు చేసి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగా, అజింకా రహానే రీఎంట్రీకి ఐపీఎల్ 2023 సీజన్ పర్ఫామెన్స్‌తో పాటు రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో అతను నమోదు చేసిన గణాంకాలు కూడా ఓ కారణం..
69
వృద్ధిమాన్ సాహా, వ్యక్తిగత కారణాలతో రంజీ ట్రోఫీలో ఆడడానికి ఇష్టపడలేదు. ఈ సమయంలో బెంగాల్ క్రికెట్ బోర్డు పెద్దలకీ, వృద్ధిమాన్ సాహాకి మధ్య చిన్నపాటి గొడవలు కూడా జరిగాయి. అదీకాకుండా శ్రీలంకతో సిరీస్ సమయంలో బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీపై నోరు జారాడు సాహా...
79
Wriddhiman Saha
టీమ్‌లో తనకి ఎప్పుడూ చోటు ఉంటుందని మాట ఇచ్చిన బీసీసీఐ (మాజీ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఇప్పుడు మాట తప్పారని, న్యూజిలాండ్‌తో సిరీస్‌లో హాఫ్ సెంచరీ చేసినా కూడా తనని ఎందుకు తప్పించారో తెలియడం లేదని కామెంట్లు చేశాడు వృద్ధిమాన్ సాహా...
89
Wriddhiman Saha
టీమ్‌లో చోటు లేకపోయేసరికి బీసీసీఐపై, సెలక్టర్లపై సాహా చేసిన కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న బోర్డు పెద్దలు, అతనికి భారత జట్టులో తిరిగి చోటు ఇవ్వకూడదని గట్టిగా ఫిక్స్ అయినట్టు సమాచారం.
99
కెఎల్ రాహుల్ గాయం తర్వాత రిప్లేస్‌మెంట్ ప్లేయర్ ఎంపిక కోసం జరిగిన మీటింగ్‌లో వృద్ధిమాన్ సాహా పేరు చర్చకు కూడా రాలేదని ఓ బీసీసీఐ అధికారి తెలియచేశాడు... అంటే సాహాని తిరిగి సెలక్ట్ చేయాలనే ఆలోచన కూడా బోర్డు సభ్యులకు లేదని తెలుస్తోంది.