రోహిత్ శర్మ బుర్ర ఎక్కడో పెట్టి ఆడుతున్నాడు... హిట్ మ్యాన్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్...

Published : May 09, 2023, 04:48 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటికే రెండు సార్లు డకౌట్ అయ్యాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. 2023 సీజన్‌లో రోహిత్ బ్యాటు నుంచి ఇప్పటిదాకా ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే వచ్చింది...  

PREV
16
రోహిత్ శర్మ బుర్ర ఎక్కడో పెట్టి ఆడుతున్నాడు...  హిట్ మ్యాన్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్...

10 మ్యాచుల్లో కలిపి 18.40 యావరేజ్‌తో 184 పరుగులే చేసిన రోహిత్ శర్మ, 126.89 స్ట్రైయిక్ రేటుతో ముంబై ఇండియన్స్ కష్టాలను మరింత పెంచుతున్నాడు. 2022 సీజన్‌లో కూడా రోహిత్ బ్యాటు నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఏమీ రాలేదు..
 

26
Virat Kohli-Rohit Sharma

‘రోహిత్ శర్మ ఫెయిల్యూర్‌కి బౌలర్లు కారణం కాదు, అతని మానసిక పరిస్థితే కారణం. రోహిత్ తనతో తానే యుద్ధం చేస్తున్నాడు. అతని బుర్ర ఎక్కడో బ్లాక్ అయ్యింది..

36

రోహిత్ శర్మ బ్యాటింగ్ టెక్నిక్‌లో ఎలాంటి లోపం కనిపించడం లేదు. అయితే అతని మనసులో ఏదో కంఫ్యూజన్ రన్ అవుతూ ఉంది. అయితే ఒక్కసారి రోహిత్ రిథమ్ అందుకుంటే, మిగిలిన మ్యాచులన్నీ మరిచిపోతారు..
 

46

రోహిత్ ఎలా ఆడతాడో, ఎలా ఆడగలడో అందరికీ తెలుసు. ఇప్పుడు అతను కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అయితే టీమిండియా కెప్టెన్సీ ప్రెషర్, అతని ఆటను దెబ్బ తీసినట్టుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.

56

‘ముంబై ఇండియన్స్ ఓపెనర్లకి ఓ క్లారిటీ లేదు. వాళ్లు వచ్చినప్పటి నుంచి చాలా రిస్కులు తీసుకుంటున్నారు. బాదాలని ఉద్దేశంతో గట్టిగా ఫిక్స్ అయి వచ్చినట్టు కనిపిస్తున్నారు. అయితే ఇన్నింగ్స్ నిర్మించడానికి ఈ మైండ్‌సెట్ ఒక్కటే సరిపోదు..
 

66
Image credit: PTI

రుతురాజ్ గైక్వాడ్‌ని చూడడం, అతను క్రీజులోకి రాగానే బాదాలని చూడడు. ముందు కుదురుకుంటాడు, మిడిల్ ఓవర్లలో దంచి కొట్టి  పరుగులు రాబడతాడు. ప్రతీ బ్యాటర్‌కి తన స్ట్రెంగ్త్, వీక్‌నెస్ తెలియాలి..’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్.. 

Read more Photos on
click me!

Recommended Stories