సెంచరీలు, హ్యాట్రిక్, సిక్సర్లు, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉన్నాయి... సూపర్ ఓవర్ మ్యాచులు ఎక్కడ?...

Published : May 09, 2023, 04:16 PM IST

ఓ అట్టర్ ఫ్లాప్ సీజన్ తర్వాత 2023 సీజన్‌ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్లు మజాని అందిస్తోంది. ఇప్పటిదాకా 16వ సీజన్‌లో 50కి పైగా మ్యాచులు జరగగా అందులో వన్‌సైడెడ్ మ్యాచుల సంఖ్య వేళ్ల మీదే లెక్కబెట్టొచ్చు...  

PREV
18
సెంచరీలు, హ్యాట్రిక్, సిక్సర్లు, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉన్నాయి... సూపర్ ఓవర్ మ్యాచులు ఎక్కడ?...

లో స్కోరింగ్ గేమ్స్ కూడా ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగడం ఐపీఎల్ 2023 సీజన్ ప్రత్యేకత. ఈ కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ స్క్రిప్టు ప్రకారం నడుస్తోందని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు...
 

28
PTI Photo) (PTI05_05_2023_000419B)

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు చూసే అవకాశం దక్కింది రింకూ సింగ్ బ్యాటింగ్ వల్ల. అదే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ హ్యాట్రిక్ కూడా తీశాడు...

38
Image credit: PTI

అజింకా రహానే, విజయ్ శంకర్, మోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా వంటి టీమిండియాలో చోటు కోల్పోయిన ప్లేయర్లు, 2023 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇప్పటిదాకా ఐపీఎల్ 2023 సీజన్‌లో మూడు సెంచరీలు కూడా నమోదయ్యాయి..
 

48

కేకేఆర్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హారీ బ్రూక్ సెంచరీ సాధించగా, కేకేఆర్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్, ముంబై ఇండియన్స్‌పై సెంచరీ బాదాడు. యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ కూడా ముంబైపైనే సెంచరీ చేశాడు..
 

58

అయితే 2023 సీజన్‌లో ఇప్పటిదాకా ఒక్క సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా నమోదు కాలేదు. మ్యాచులన్నీ ఎక్కువ శాతం ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగుతుండడంతో సూపర్ ఓవర్ మ్యాచులు చూసే అవకాశం వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారి ఆ ఛాన్స్ ఇంకా రావడం లేదు..
 

68


యూఏఈలో జరిగిన 2020 సీజన్‌లో ఏకంగా నాలుగు సూపర్ ఓవర్ మ్యాచులు జరిగాయి. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌ అయితే ఏకంగా డబుల్ సూపర్ ఓవర్ దాకా వెళ్లింది. 
 

78

2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ సూపర్ ఓవర్‌ వరకూ వెళ్లింది. అయితే 2022 నుంచి ఐపీఎల్‌లో ‘సూపర్ ఓవర్’ మ్యాచులు కనిపించడం లేదు. ఈసారి లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్ పెరిగినా ఒక్క మ్యాచ్ కూడా టైగా ముగియకపోవడం విశేషం.. 

88

ఇప్పటికే ఐపీఎల్ 2023 సీజన్‌, 2022 సీజన్ కంటే బెటర్ వ్యూయర్‌షిప్ సాధించి, సూపర్ సక్సెస్ సాధించింది. ఇకపై ప్లేఆఫ్స్ రేసు జోరు పెరుగుతుంది కాబట్టి మరింత మజా రానుంది. అయితే సూపర్ ఓవర్ మ్యాచులు పడితే, ఆ జోరు మరింత పెరుగుతుందని అంటున్నారు అభిమానులు.. 

click me!

Recommended Stories