ఇది సార్ ఆర్‌సీబీ బ్రాండు! ధోనీ రికార్డును లేపేసిన ఆర్‌సీబీ... అర్ధరాత్రి ఆఖరి ఓవర్‌లో పీక్‌లోకి...

First Published Apr 11, 2023, 5:52 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో గత మూడు రోజులుగా సాగుతున్న మ్యాచులు హోరాహోరీ ఫైట్‌తో ఫ్యాన్స్‌కి ఫుల్లు కిక్కుని అందిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన నైల్ బైటింగ్ మ్యాచ్‌ని మరవక ముందే ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌ కూడా ఆ రేంజ్‌లోనే సాగింది...

(PTI PhotoShailendra Bhojak)(PTI04_10_2023_000192B)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ దంచి కొట్టి హాఫ్ సెంచరీలతో మెరవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ, 212 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంత టార్గెట్ కొట్టిన తర్వాత ఏ టీమ్ అయినా ఓడిపోతుందని అనుకుంటారా?

ఆరంభంలో మహ్మద్ సిరాజ్, వేన్ పార్నెల్ చెలరేగిపోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 105 పరుగులకే 5 వికెట్లు పోవడంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ చాలామంది గుండెల మీద చేయి వేసుకుని పడుకున్నారు. అయితే ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..

Latest Videos


(PTI PhotoShailendra Bhojak)(PTI04_10_2023_000253B)

నికోలస్ పూరన్ సిక్సర్ల మోత, అతనికి ఆయుష్ బదోనీ మంచి సపోర్ట్ ఇవ్వడంతో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని కమ్‌బ్యాక్ ఇచ్చింది. అయితే ఈ ఇద్దరూ వెంటవెంటనే అవుట్ కావడంతో మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ సాగింది...

Image credit: PTI

చివరి ఓవర్‌లో జరిగిన హై డ్రామా వేరే లెవెల్. 5 పరుగులు కావాల్సిన దశలో రెండో బంతికి వికెట్ పడింది. ఒక్క పరుగు కావాల్సిన సమయంలో మరో వికెట్ పడడంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో మొట్టమొదటి సూపర్ ఓవర్ మ్యాచ్ చూడవచ్చని అనుకున్నారు ఫ్యాన్స్.. అప్పటికే సమయం 11 గంటల 30 నిమిషాలు..

Harshal Patel Mankading

చాలామంది మ్యాచ్ గురించి మరిచిపోయి మంచి నిద్రలో ఉండే సమయం. ఆఖరి ఓవర్‌లో మ్యాచ్ సూపర్ ఓవర్ దిశగా సాగుతుందని తెలియడంతో ఒక్కసారిగా మొబైల్స్‌లో ఆన్ అయిపోయాయి! 1 కోటి ఉన్న రియల్ టైమ్ వ్యూస్, ఏకంగా 1.8 కోట్లకు చేరుకుంది.. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇదే అత్యధికం..

Image credit: PTI

ఇంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో వచ్చి 3 బంతులు ఆడి 2 సిక్సర్లు కొట్టి అవుట్ అయ్యాడు మహేంద్ర సింగ్ ధోనీ. ధోనీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జియో సినిమా యాప్‌లో రియల్ టైం వ్యూస్‌ 1.7 కోట్లను తాకింది..
 

Image credit: PTI

అంతకుముందు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రియల్ టైం వ్యూస్ 1.6 కోట్లుగా ఉంది. ధోనీ రికార్డును కాపాడుకోవాలనే ఉద్దేశంలో కొంత మంది ధోనీ ఫ్యాన్స్, ఆర్‌సీబీ ఆడే మ్యాచులను చూడవద్దంటూ మాహీ ఫ్యాన్స్‌కి సూచించారు. అయితే సూపర్ థ్రిల్లర్ మ్యాచ్ కావడంతో చాలా మంది మొబైల్స్ ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోయాయి..

దీంతో మాహీ రికార్డును ఆర్‌సీబీ కలిసి కట్టుగా లేపేసింది.. చెన్నై సూపర్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడబోతోంది. రాయల్స్ మంచి ఫామ్‌లో ఉండడంతో ఇరుజట్ల మధ్య హోరాహోరీ ఫైట్ జరిగే ఛాన్స్ చాలానే ఉంది. ఈ మ్యాచ్‌లో మాహీ బ్యాటింగ్‌కి వస్తే, ఆర్‌సీబీ రికార్డు బ్రేక్ అవుతుందేమో చూడాలి..

click me!