మీ టీమ్‌లో సగం మంది మా ప్లేయర్లే! చెన్నై సూపర్ కింగ్స్‌ని ట్రోల్ చేసిన రాజస్థాన్ రాయల్స్...

Published : Apr 27, 2023, 06:26 PM ISTUpdated : Apr 27, 2023, 07:45 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్, గత సీజన్ రన్నరప్‌ రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కి ముందు రాజస్థాన్ రాయల్స్ షేర్ చేసిన ఓ వీడియో, సోషల్ మీడియాలో తగె వైరల్ అవుతోంది...  

PREV
18
మీ టీమ్‌లో సగం మంది మా ప్లేయర్లే! చెన్నై సూపర్ కింగ్స్‌ని ట్రోల్ చేసిన రాజస్థాన్ రాయల్స్...
Image credit: PTI

రాజస్థాన్ రాయల్స్‌కి బయట క్రేజ్ తక్కువ అయినా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సమయానికి తగ్గట్టుగా కాస్త ఛమత్కారం, వెటకారం జోడించి మీమ్స్ పబ్లిష్ చేస్తుంటాడు రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా అడ్మిన్...
 

28

‘ఇతను మా సోనూ యే... ’ అంటూ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్న అజింకా రహానే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, బెన్ స్టోక్స్‌లను చూపించింది రాజస్థాన్ రాయల్స్.. వీరితో పాటు పాటు ప్రస్తుతం సీఎస్‌కే తరుపున అదరగొడుతున్న ఆకాశ్ సింగ్ కూడా గతంలో రాజస్థాన్ రాయల్స్‌ని నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు...
 

38

గతంలో రాజస్థాన్ రాయల్స్‌కి కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన అజింకా రహానే, 2023 సీజన్‌లో బేస్ ప్రైజ్‌ రూ.50 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వెళ్లాడు. అదిరిపోయే పర్ఫామెన్స్‌తో 180+ స్ట్రైయిక్ రేటుతో సీఎస్‌కేకి కీ బ్యాటర్‌గా మారాడు అజింకా రహానే...

48
Image credit: PTI

గతంలో రాజస్థాన్ రాయల్స్‌కి ఆడిన బెన్ స్టోక్స్‌ని ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఇప్పటిదాకా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన బెన్ స్టోక్స్, గాయం కారణంగా చాలా మ్యాచులకు దూరమయ్యాడు...
 

58

ఐపీఎల్ ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్‌కి ఆడిన రవీంద్ర జడేజా, టీమ్ మారేందుకు ప్రయత్నాలు చేసి ఏడాది నిషేధానికి కూడా గురయ్యాడు. 11 సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్న జడేజా, ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్‌లో రూ.16 కోట్లు తీసుకుంటున్నాడు...
 

68

గతంలో ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్‌కి ఆడినా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శివమ్ దూబే, చెన్నై సూపర్ కింగ్స్‌కి మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. వీరే కాదు గతంలో సీఎస్‌కేకి ఆడిన జాసన్ హోల్డర్, ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్నాడు...
 

78
Shane Watson

క్రిస్ మోరిస్, షేన్ వాట్సన్, రాబిన్ ఊతప్ప, రవిచంద్రన్ అశ్విన్ వంటి ప్లేయర్లు, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్‌కి కూడా ఆడారు. షేన్ వాట్సన్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అసిస్టెంట్ కోచ్‌గా ఉంటే, రాబిన్ ఊతప్ప క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చి కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. అశ్విన్, ప్రస్తుతం రాయల్స్ టీమ్‌లో ఉన్నాడు. 

88

ఐపీఎల్ 2021 సీజన్‌లో క్రిస్ మోరిస్‌ని రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. అయితే ఆ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మోరిస్, 2022 మెగా వేలంలో రూ.11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కి అమ్ముడుపోయాడు. అయితే వేలం ముగిసిన తర్వాతి రోజే, అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు క్రిస్ మోరిస్.. 

click me!

Recommended Stories