ఐపీఎల్ 2023 సీజన్‌లో దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ టీమ్ కాంబినేషన్‌ని మారుస్తూ వస్తోంది కోల్‌కత్తా నైట్ రైడర్స్. 2023 సీజన్‌లో ఇప్పటిదాకా 8 మ్యాచుల్లో 3 విజయాలు అందుకుంది కేకేఆర్, అయితే అందులో రెండు విజయాలు ఆర్‌సీబీపైనే వచ్చాయి...
ఆర్‌సీబీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో 200+ స్కోరు అందించగా, రెండో మ్యాచ్‌లో జాసన్ రాయ్, నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్ సమిష్టిగా రాణించారు...
29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసిన జాసన్ రాయ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే నారాయణ్ జగదీశన్ అవుటైన కొద్దిసేపటికే జాసన్ రాయ్ కూడా విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
35
వైడ్ బాల్ యార్కర్‌తో లెగ్ స్టంప్‌న లేపేసిన విజయ్ కుమార్ వైశాక్, ఆర్‌సీబీకి కీలక వికెట్‌ని అందించాడు. అయితే బౌల్డ్ కాగానే అసహనానికి లోనైన జాసన్ రాయ్, తన బ్యాటుతో వికెట్లను కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే మళ్లీ బ్యాటును వెనక్కి తీసుకుని వెళ్లిపోయాడు. వెళ్లిపోతూ బ్యాటుకి గాల్లోకి ఎగిరేసి, కింద పడిన తర్వాత పట్టుకుపోయాడు...
అవుట్ కాగానే బ్యాటుతో బెయిల్స్‌ని కొట్టేందుకు ప్రయత్నించినందుకు జాసన్ రాయ్‌కి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. ‘బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో క్రమశిక్షణా నియామవళిని ఉల్లంఘించినందుకు కేకేఆర్ బ్యాటర్ జాసన్ రాయ్‌కి 10 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించాం..
55
Jason Roy
ఆర్టికల్ 2.2 ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఉల్లంఘించిందనుకు జాసన్ రాయ్ తన తప్పును అంగీకరించాడు.’ అంటూ స్టేట్‌మెంట్ ద్వారా తెలియచేసింది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. ఆర్టికల్ 2.2 నిబంధన ప్రకారం మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలను, బట్టలను, గ్రౌండ్ ఎక్విప్‌మెంట్‌ను కొట్టడం, అవమానించడం శిక్షార్హం...