తప్ప తాగి, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్... టీమ్ ఏం చేసిందంటే...

Published : Apr 27, 2023, 05:29 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా 5 మ్యాచుల్లో ఓడిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. కేకేఆర్‌ని ఓడించి బోణీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని చిత్తు చేసి రెండో విజయం అందుకుంది...

PREV
18
తప్ప తాగి, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్... టీమ్ ఏం చేసిందంటే...
PTI Photo)(PTI04_24_2023_000369B)

వరుసగా రెండు విజయాలు రావడంతో పార్టీ చేసుకుందట ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్. అయితే ఈ పార్టీలో తప్ప తాగిన ఓ క్రికెటర్, ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్టు సమాచారం. ఆ మహిళ ఎవరు? ఆ ప్లేయర్ ఎవరు? అనే విషయాలు బయటికి రాకపోయినా ఈ సంఘటనతో ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్, ప్లేయర్లకు కఠిన ఆంక్షలు విధించింది..

28
Image credit: PTI

ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్ సభ్యులు బస చేస్తున్న హోటల్‌ రూమ్‌లోకి రాత్రి వేళల్లో ఎవ్వరూ కూడా రాకూడదని, రాత్రి 10 గంటలు దాటిన తర్వాత బయటి వ్యక్తులకు హోటల్ గదుల్లోకి అనుమతిని నిషేధిస్తున్నట్టు ప్లేయర్లకు ఆదేశాలు ఇచ్చింది మేనేజ్‌మెంట్...

38
PTI Photo)(PTI04_24_2023_000339B)

ఎవరైనా టీమ్ మేనేజ్‌మెంట్ ఉత్తర్వులను ఉల్లంఘించి, రాత్రి వేళల్లో ఎవరినైనా హోటల్ గదుల్లోకి తీసుకువస్తే, వారికి భారీ జరిమానా వేయడంతో పాటు టీమ్ నుంచి తప్పిస్తామని హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నాయి...

48
PTI Photo/Vijay Verma) (PTI04_20_2023_000405B)

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ప్లేయర్, భారత క్రికెటర్ ఆ? లేక విదేశీ ప్లేయర్‌ ఆ? అనే విషయాలు కూడా తెలియరాలేదు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది చాలా రకాలుగా అంచనాలు వేస్తున్నారు...
 

58
PTI Photo/Vijay Verma) (PTI04_20_2023_000483B)

కొన్నిరోజుల కిందట ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రికెట్ కిట్స్‌ని గుర్తు తెలియని దుండగులు దొంగిలిచారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కి ముందు కొన్ని కిట్స్ దొరికినా, ఇంకా అన్నీ దొరకలేదు. ఈ సంఘటన మరువకముందే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ నుంచే మరో సంఘటన బయటికి వచ్చింది.

68

టీమిండియాలో పరమ స్టిక్ కెప్టెన్‌గా పేరొందిన సౌరవ్ గంగూలీ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్నాడు. అలాగే ఆస్ట్రేలియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రికీ పాంటింగ్, ఢిల్లీకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు..

78

ఇలాంటి ఇద్దరు దిగ్గజాలు నడిపిస్తున్న టీమ్‌లో ఇలాంటి సంఘటనలు వెలుగుచూడడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఈ ఇద్దరూ క్రమశిక్షణ తప్పిన ఆ ప్లేయర్‌ని ఎందుకు చూసి, చూడనట్టు వదిలేశారని నిలదీస్తున్నారు కొందరు అభిమానులు.. 
 

88
SRH vs DC

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 పరుగుల తేడాతో విజయం అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, తన తర్వాతి మ్యాచ్‌ని కూడా అదే టీమ్‌తో ఆడనుంది. హైదరాబాద్‌లో హైదరాబాద్‌ని ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్, ఈసారి ఢిల్లీలో ఆ టీమ్‌తో తలబడనుంది..
 

click me!

Recommended Stories