ఎవరిని ఆడించినా ఆడించకపోయినా ఈ కుర్రాడిని టీమిండియాకి ఆడించాలి... యశస్వి జైస్వాల్ బ్యాటింగ్‌కి...

Published : Apr 27, 2023, 08:11 PM IST

పృథ్వీ షా, రింకూ సింగ్, సర్ఫరాజ్ ఖాన్, జితేశ్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్... ఇలా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న ప్లేయర్ల సంఖ్య భారీగానే ఉంది. అయితే ఎవరికి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఓ 21 ఏళ్ల కుర్రాడిని మాత్రం టీమిండియాలోకి అర్జెంటుగా తీసుకురావాలని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. అతనే యశస్వి జైస్వాల్...

PREV
16
ఎవరిని ఆడించినా ఆడించకపోయినా ఈ కుర్రాడిని టీమిండియాకి ఆడించాలి... యశస్వి జైస్వాల్ బ్యాటింగ్‌కి...
PTI Photo/Shailendra Bhojak)(PTI04_23_2023_000275B)

అండర్19 వరల్డ్ కప్ 2020 తర్వాత భారత దేశవాళీ క్రికెట్‌లో ఓ సంచలనంగా మారాడు యశస్వి జైస్వాల్... తిరుగులేని రికార్డులతో నిలకడైన ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ కుర్రాడి కోసం ఐపీఎల్ 2020 వేలంలో పోటీపడ్డాయి ఫ్రాంఛైజీలు. అండర్ 19 వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన ఈ కుర్రాడిని రూ.2 కోట్ల 40 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్...

26
Image credit: PTI

ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్లను కూడా పక్కనబెట్టేసిన రాజస్థాన్ రాయల్స్, జోస్ బట్లర్, సంజూ శాంసన్‌తో పాటు యశస్వి జైస్వాల్‌ని అట్టిపెట్టుకుంది. కారణం అతన్ని వేలానికి వదిలితే, తిరిగి కొనుగోలు చేయడం కష్టమైపోతుందని రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగర్కరకి బాగా తెలుసు..

36
Image credit: BCCI

రంజీ ట్రోఫీ 2023 సీజన్‌తో పాటు ఇరానీ ట్రోఫీలోనూ సెంచరీల మోత మోగించిన యశస్వి జైస్వాల్, సీఎస్‌కేతో 2021లో జరిగిన మ్యాచ్‌లో జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో 3 సిక్సర్లు, ఓ ఫోర్ బాది 19 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు...
 

46

బతుకుతెరువు కోసం పానీపూరీ అమ్మిన ఈ కుర్రాడు, 2023 సీజన్‌లో సంచలన ప్రదర్శన ఇస్తున్నాడు. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు యశస్వి జైస్వాల్. ఓ వైపు జోస్ బట్లర్ వంటి సీనియర్, వరల్డ్ క్లాస్ బ్యాటర్ కూడా జైస్వాల్ దూకుడుగా ఆడుతుంటే అతనికి స్ట్రైయిక్ ఇస్తూ యాంకర్ రోల్ పోషిస్తున్నాడు...

56
Image credit: PTI

భారీ సిక్సర్లు, చూడచక్కని ఫోర్లు బాదుతున్న ఈ కుర్రాడు, టీమిండియాకి ఓపెనర్‌గా సరిగ్గా సెట్ అవుతాడని, కెఎల్ రాహుల్ వంటి టెస్టు బ్యాటర్లను ఆడించేబదులు యశస్వి జైస్వాల్‌కి టీ20ల్లో అవకాశం ఇవ్వాలని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...
 

66

ఐపీఎల్ 2021 సీజన్‌లో 600+ పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, టీమిండియాలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తూ ఎక్కువ మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌కి దూరంగా ఉండడంతో ఇప్పుడు అక్కడ ఖాళీలు ఉన్నాయి. జైస్వాల్, రుతురాజ్‌ గైక్వాడ్‌లను పొట్టి ఫార్మాట్‌లో ఆడిస్తే బాగుంటుందని అంటున్నారు ఫ్యాన్స్.. 

click me!

Recommended Stories