తీసుకున్న డబ్బుకు పూర్తి న్యాయం చేసిన పైసా వసూల్ ప్లేయర్లు వీరే! రహానేతో పాటు కాన్వే, రింకూ సింగ్...

Published : Apr 27, 2023, 07:44 PM IST

ఐపీఎల్ 2023 మినీ వేలంలో మునుపటి రికార్డులన్నీ బద్ధలయ్యాయి. ఏకంగా రూ.18.5 కోట్లు పెట్టి సామ్ కుర్రాన్‌ని కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. మెగా వేలానికి ముందు ఎప్పుడూ ఏ ప్లేయర్ కోసం రూ.10 కోట్ల పెట్టని ముంబై కూడా కామెరూన్ గ్రీన్ కోసం రూ.17.5 కోట్లు పెట్టింది...

PREV
112
తీసుకున్న డబ్బుకు పూర్తి న్యాయం చేసిన పైసా వసూల్ ప్లేయర్లు వీరే! రహానేతో పాటు కాన్వే, రింకూ సింగ్...

ఎప్పటిలాగే ఐపీఎల్ ఆనవాయితీని కొనసాగిస్తూ భారీ ధర దక్కించుకున్న ప్లేయర్లు, 2023 సీజన్‌లో ఫ్లాప్ అవుతున్నారు. సామ్ కుర్రాన్, కామెరూన్ గ్రీన్ వంటి కొందరు సోసోగా ఆడితే, హారీ బ్రూక్, నికోలస్ పూరన్ వంటి ఇంకొందరు ఒకటి రెండు మ్యాచుల్లోనూ బాగా ఆడారు. బెన్ స్టోక్స్, దీపక్ చాహార్ వంటి హ్యూజ్ ప్రైజ్ ప్లేయర్లు మరికొందరు గాయాలతో టీమ్‌కి అందుబాటులో ఉండడం లేదు...

212
Image credit: PTI

అయితే వేలంలో తక్కువ ధర దక్కించుకున్న ప్లేయర్లు, ఐపీఎల్ 2023 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ... మ్యాచ్ విన్నర్లుగా, గేమ్ ఛేంజర్లుగా మారుతున్నారు. ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు అజింకా రహానేనే. ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌కి సీఎస్‌కేలోకి వచ్చిన రహానే, ఇప్పటికే అంతకు రెట్టింపు పర్ఫామెన్స్ ఇచ్చేశాడు...

312
Image credit: PTI

డివాన్ కాన్వే, ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.1 కోటికి ఈ న్యూజిలాండ్ ప్లేయర్‌ని కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. గత సీజన్‌లో ఆకట్టుకున్న కాన్వే, ఈ సీజన్‌లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు బాది, సీఎస్‌కే తరుపున టాప్ స్కోరర్‌గా ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు...

412
Image credit: PTI

ఐపీఎల్ 2023 సీజన్‌ మినీ వేలంలో కైల్ మేయర్స్‌ని రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. 7 మ్యాచుల్లో 243 పరుగులు చేసిన కైల్ మేయర్స్, ఆరంభంలో 180+ స్ట్రైయిక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. మేయర్స్‌ని కొనసాగిస్తున్న లక్నో, క్వింటన్ డి కాక్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతోంది..

512


సాయి సుదర్శన్‌ని ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్.  5 మ్యాచుల్లో 176 పరుగులు చేసిన సాయి సుదర్శన్, 2 హాఫ్ సెంచరీలు బాదాడు...

612
Image credit: PTI

ఐపీఎల్ 2023 సీజన్‌లో జింబాబ్వే ప్లేయర్ సికందర్ రజాని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. 4 మ్యాచుల్లో ఓ హాఫ్ సెంచరీ బాది 2 వికెట్లు కూడా తీసిన సికందర్ రజా, ఓ మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలిచాడు...

712

మయాంక్ మర్కండేని ఐపీఎల్ 2023 వేలంలో రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మొదటి మూడు మ్యాచుల్లో ఆడని మయాంక్ మర్కండే, ఆ తర్వాత 5 మ్యాచుల్లో 8 వికెట్లు తీసి అదరగొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబద్ తరుపున టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు మర్కండే..

812
PTI Photo/Swapan Mahapatra) (PTI04_06_2023_000300B)

ఐపీఎల్ 2023 వేలంలో రింకూ సింగ్‌ని  రూ.55 లక్షలకు కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్ రైడర్స్. 8 మ్యాచుల్లో 251 పరుగులు చేసిన రింకూ సింగ్, 2 హాఫ్ సెంచరీలతో 62.75 యావరేజ్‌తో 158.86 స్ట్రైయిక్ రేటుతో అదరగొడుతున్నాడు...

912

వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లాని ఐపీఎల్ 2023 వేలంలో రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. 7 మ్యాచుల్లో 11 వికెట్లు తీసిన పియూష్ చావ్లా, ముంబై ఇండియన్స్ తరుపున టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు...

1012

సుయాశ్ శర్మ, దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం కూడా లేని ఈ స్పిన్నర్‌ని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్. 6 మ్యాచుల్లో 9 వికెట్లు తీసిన సుయాశ్ శర్మ, కేకేఆర్‌కి ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా మారాడు...
 

1112

సందీప్ శర్మ, ఐపీఎల్ 2023 సీజన్‌లో అమ్ముడుపోని ఈ బౌలర్‌, ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్‌లో రాజస్థాన్ రాయల్స్‌లోకి వచ్చాడు. 5 మ్యాచుల్లో 7 వికెట్లు తీసిన సందీప్ శర్మ, 8.21 ఎకానమీతో బౌలింగ్ చేస్తూ రాజస్థాన్‌కి కీ బౌలర్‌గా మారాడు...

1212

మోహిత్ శర్మ, ఐపీఎల్ 2022 సీజన్‌లో అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరిన ఈ సీనియర్ ఫాస్ట్ బౌలర్, 2023 వేలంలో బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు గుజరాత్ టైటాన్స్‌లోకి వచ్చాడు. 4 మ్యాచుల్లో 6 వికెట్లు తీసిన మోహిత్ శర్మ, రెండు మ్యాచుల్లో తన బౌలింగ్‌తో టీమ్‌కి విజయాన్ని అందించాడు..

click me!

Recommended Stories