ప్లేఆఫ్స్‌కు ముందు - తర్వాత..! అదే జరిగితే ఐపీఎల్ ఫైనల్లో మరో ఎల్ క్లాసికో..

Published : May 25, 2023, 01:15 PM IST

IPL 2023: రెండు నెలలుగా దేశంలోని వివిధ నగరాల్లో జరుగుతున్న ఐపీఎల్ -16 లో ఇంకా 2 మ్యాచ్ లు మాత్రమే మిగిలున్నాయి.  లీగ్ చరిత్రలో ఒక్కసారి కూడా తమ  ప్రత్యర్థుల మీద గెలవని టీమ్స్.. సంచలన విజయాలతో  కొత్త చరిత్రలు సృష్టిస్తున్నాయి. 

PREV
17
ప్లేఆఫ్స్‌కు ముందు - తర్వాత..! అదే జరిగితే ఐపీఎల్ ఫైనల్లో మరో ఎల్ క్లాసికో..

ఐపీఎల -16  ప్లేఆఫ్స్ లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్   అర్హత సాధించాయి. అయితే ప్లేఆఫ్స్ కు ముందు.. చెన్నై గుజరాత్ తో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆడిన మూడు మ్యాచ్ లలోనూ  చెన్నైకి షాకులు తప్పలేదు. 

27

ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా అంతే. లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడిన మూడు  మ్యాచ్ లలో కూడా రోహిత్ సేనకు పరాభవాలే. కానీ  ప్లేఆఫ్స్ లో  క్వాలిఫయర్ -1, ఎలిమినేటర్ తర్వాత  ఈ లెక్కలు మారాయి. చెన్నై గుజరాత్ ను ఓడించింది. ముంబై లక్నోను చిత్తు చేసింది. 

37

ఇక రేపు (మే 26న)  క్వాలిఫయర్ - 2లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ ఢీకొనునుంది. మరి ఈ మ్యాచ్ లో  భాగంగా ముంబై - గుజరాత్ మధ్య రికార్డులు ఎలా ఉన్నాయి..? ఎవరిది పైచేయిగా ఉంది...? అనేది ఒకసారి చూద్దాం. 

47

2022 సీజన్ లో  ఐపీఎల్ లోకి ఎంట్రీ  ఇచ్చింది గుజరాత్ టైటాన్స్. ఈ సీజన్ లో ముంబైతో జరిగిన  మ్యాచ్ లో గుజరాత్  ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్ లో ఇరు జట్ల మధ్య   రెండు మ్యాచ్ లు జరిగాయి.   అహ్మదాబాద్ లో  జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 55 పరుగుల తేడాతో గెలవగా వాంఖడేలో రోహిత్ సేన  27 పరుగుల తేడాతో గెలిచింది. అంటే ఇప్పటివరకు ఈక్వెషన్ ముంబై 2-1 కే అనుకూలంగా ఉంది.  

57

దీనితో పాటు  ప్లేఆఫ్స్ లో భాగంగా   రెండో క్వాలిఫయర్ లో  రోహిత్ కు జబర్దస్త్ రికార్డు ఉంది. 2017 నుంచి  క్వాలిఫయర్ - 2 లో ఆడిన ఏ ఒక్క మ్యాచ్ లో కూడా ముంబై ఇండియన్స్ ఓడిపోలేదు. ఏడు మ్యాచ్ లు ఆడితే ఏడింటిలోనూ ముంబైదే విజయం. అదీగాక  ప్లేఆఫ్స్ లో  రోహిత్  విజయాల శాతం  70 పర్సెంట్ పైమాటే.  

67
Image credit: PTI

అయితే గుజరాత్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదు.  క్వాలిఫయర్ - 2 జరిగేది  అహ్మదాబాద్ లోనే. ఇక్కడ  ఆ జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కు  మంచి రికార్డు ఉంది.  ఈ సీజన్ లో  సూపర్ ఫామ్ లో  ఉన్న  గిల్ తో పాటు  ఆ జట్టులో సాహా, హార్ధిక్, తెవాటియా, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ ప్రమాదకరం.  వీరిని అడ్డుకోకుంటే ముంబైకి షాకులు తప్పవు. 

77

ఒకవేళ గుజరాత్ కు ముంబై ఇండియన్స్ అడ్డుకట్ట వేయగలిగితే ఐపీఎల్ కు మళ్లీ గోల్డెన్ డేస్ వచ్చినట్టే. అప్పుడు ఫైనల్ లో తలపడబోయేది చెన్నై సూపర్ కింగ్స్ - ముంబై ఇండియన్స్. ఈ ఎల్ క్లాసికో కోసం ఇరు జట్ల అభిమానులతో పాటు ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి  అహ్మదాబాద్ లో రెండో క్వాలిఫయర్ విజేత ఎవరవుతారో తేలాంటే మరో రోజు ఆగాల్సిందే.  

click me!

Recommended Stories