బుమ్రా, ఆర్చర్ లేరు.. రోహిత్ ఫామ్‌లో లేడు.. అయినా దూసుకుపోతున్న ముంబై..

Published : May 25, 2023, 11:35 AM ISTUpdated : May 25, 2023, 11:37 AM IST

IPL 2023 Playoffs: ఐపీఎల్ -16 లో ముంబై ఇండియన్స్  మరోసారి  కప్ కొట్టేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నది.  ఇప్పటికే ప్లేఆఫ్స్  చేరిన ముంబై..  ఎలిమినేటర్ లో లక్నోను ఓడించింది.  

PREV
18
బుమ్రా, ఆర్చర్ లేరు.. రోహిత్ ఫామ్‌లో లేడు.. అయినా దూసుకుపోతున్న ముంబై..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఐదు సార్లు  ఛాంపియన్ అయిన  ముంబై ఇండియన్స్.. మరోసారి ట్రోఫీ నెగ్గేందుకు  ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నది.   ప్రస్తుతం ప్లేఆఫ్స్ ఆడుతున్న  రోహిత్ సేన.. గత సీజన్ లో మాత్రం దారుణంగా విఫలమైంది.   పాయింట్ల పట్టికలో  ఏకంగా పదో స్థానంలో నిలిచి విమర్శల పాలైంది. 

28

ఈ సీజన్  లో కూడా ముంబైకి టోర్నీ ప్రారంభం  ముందే  ఎదురుదెబ్బలు తగిలాయి.   ఆ జట్టు కీలక పేసర్  జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా మొత్తం సీజన్‌కే దూరమయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న జోఫ్రా ఆర్చర్ కూడా    నాలుగు మ్యాచ్ లే ఆడి పెద్దగా రాణించకుండానే  ఇంగ్లాండ్ కు వెళ్లిపోయాడు. 

38

ఐపీఎల్ -16 లో  ముంబై  సారథి రోహిత్ శర్మ కూడా  ఢిల్లీ క్యాపిటల్స్,  సన్ రైజర్స్ తో   అర్థ సెంచరీలను మినహాయిస్తే గొప్ప ప్రదర్శనలు చేయలేదు.  అంతేగాక   రెండు సార్లు డకౌట్ అయి  అత్యధిక డకౌట్ల రికార్డు (16.. ఈ రికార్డును దినేశ్ కార్తీక్ ఇటీవలే బ్రేక్ చేశాడు)ను కూడా  సృష్టించాడు.   ఇషాన్ కిషన్ అడపాదడపా  మెరుపులు తప్ప నిలకడగా ఆడలేదు. 

48
Image credit: PTI

ఇన్ని అవాంతరాలు ఉన్నా ముంబై  ప్లేఆఫ్స్ కు చేరిందంటే అది కుర్రాళ్ల గొప్పతనమే. తిలక్ వర్మ, నెహల్ వధెరా, కామెరూన్ గ్రీన్,  టిమ్ డేవిడ్ వంటి బ్యాటర్లు.. ఆకాశ్ మధ్వాల్ తో పాటు సీనియర్ స్పిన్నర్ పీయూష్ చావ్లా  వంటి బౌలర్ల రూపంలో ఆ జట్టుకు అద్భుత విజయాలను అందించారు.  

58
Image credit: PTI

ఈ సీజన్ లో   10 మ్యాచ్ లు ఆడిన  తిలక్ వర్మ.. 10 ఇన్నింగ్స్ లలో  300 పరుగులు చేశాడు.  బ్యాటింగ్ సగటు 42.86గా ఉండగా..  స్ట్రైక్ రేట్  153.85గా ఉంది.  తిలక్ తో పాటు నెహల్ వధేర కూడా ఆ జట్టు మిడిలార్డర్ లో కీలక బ్యాటర్ గా ఎదుగుతున్నాడు.  13 మ్యాచ్ లు ఆడిన వధెర.. 9 ఇన్నింగ్స్ లలో 237 పరుగులు సాధించాడు.  లక్నోతో మ్యాచ్ లో  ఆఖరి ఓవర్లో  వధెర  మెరుపులతోనే ముంబై  180 మార్కు దాటింది.

68

ఈ ఏడాది రూ. 17 కోట్లు వెచ్చించి దక్కించుకున్న కామెరూన్ గ్రీన్ కూడా  ముంబై విజయాలలో కీలక భూమిక పోషించాడు. ఈ సీజన్ లో 15 మ్యాచ్ లు ఆడిన గ్రీన్.. 422 పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలో అతడి సగటు  52.75గా నమోదైంది.  ఈ సీజన్ లో అతడు రెండు  అర్థ సెంచరీలు, ఓ సెంచరీ కూడా చేశాడు.    ఈ ముగ్గురికీ తోడు  సూర్యకుమార్ యాదవ్  కూడా రాణించడం ముంబైకి అదనపు బలం అయింది. 

78
Image credit: PTI

ఇక బౌలింగ్ లో   బుమ్రా, ఆర్చర్ లు లేకున్నా ముంబై  ఇక్కడిదాకా వచ్చిందంటే దానికి కారణం  పీయూష్ చావ్లా, ఆకాశ్  మధ్వాల్ లే.   కెరీర్ ముగిసిందనుకున్న దశలో ముంబై ఇండియన్స్ ఛాన్స్ ఇవ్వడంతో  ఈ సీజన్ లో ఆ జట్టు తరఫున ఆడుతన్న   చావ్లా..   15 మ్యాచ్ లలో 21 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో  3వ స్థానంలో నిలవడం గమనార్హం.  

88

సీజన్ ఆఖర్లో వచ్చినా మధ్వాల్ ఆ జట్టుకు కీలక  బౌలర్ గా మారాడు.  ఆడింది ఏడు మ్యాచ్ లే అయినా డెత్ ఓవర్లలో   ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నాడు. ఏడు మ్యచ్ లలో   21.3 ఓవర్లు వేసి 167 పరుగులిచ్చి  13 వికెట్లు పడగొట్టాడు.   అతడి ఎకానమీ రేట్  7.7 గా నమోదవడం గమనార్హం.  

click me!

Recommended Stories