ప్చ్..! ఆ షాట్ ఆడకుండా ఉండాల్సింది.. నేను ఔట్ అవడం మా జట్టు ఓటమికి దారితీసింది : కృనాల్ పాండ్యా

Published : May 25, 2023, 12:20 PM IST

IPL 2023 Playoffs: లక్నో సూపర్ జెయింట్స్   సారథి కృనాల్ పాండ్యా   నిన్న ముంబైతో ఎలిమినేటర్  మ్యాచ్ ముగిసిన  తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఔట్ అవడం వల్లే  మ్యాచ్ పోయిందని చెప్పాడు. 

PREV
16
ప్చ్..! ఆ షాట్ ఆడకుండా ఉండాల్సింది.. నేను ఔట్  అవడం మా జట్టు ఓటమికి దారితీసింది : కృనాల్ పాండ్యా
Image credit: PTI

ఐపీఎల్ - 16 లో భాగంగా బుధవారం రాత్రి చెన్నై వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ - ముంబై ఇండియన్స్ మధ్య ముగిసిన  ఎలిమినేటర్  మ్యాచ్ లో  ముంబై 81 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.  అయితే ఈ మ్యాచ్ లో  ఒక దశలో లక్నో.. విజయం దిశగా సాగుతూ  బెటర్ పొజిషన్ లోనే ఉంది.  కానీ తర్వాత గాడి తప్పి వరుసగా వికెట్లు కోల్పోయింది. 

26

మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో సారథి  కృనాల్ పాండ్యా కూడా ఇవే వ్యాఖ్యలు చేశాడు.  మ్యాచ్ ను తాము శాసించే స్థితిలో ఉండి కూడా ఓడిపోయామని, తాను  ఔట్ అవడంతో లక్నో టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిందని   పాండ్యా అన్నాడు. 

36

కృనాల్ మాట్లాడుతూ... ‘ఈ మ్యాచ్ లో మేం బ్యాటింగ్ చేసేప్పుడు ఒక దశలో బెటర్ పొజిషన్ లో ఉన్నాం.  కానీ  నేను ఔట్ అయ్యాక మొత్తం తలకిందులైంది. నేను ఆ షాట్ ఆడకుండా ఉండాల్సింది. మేం మరింత మెరుగైన క్రికెట్ ఆడితే బాగుండేది.  అందుకు పూర్తి బాధ్యత నాదే. 

46

బంతి  బ్యాట్ మీదకు వస్తూ హిట్టింగ్ ఆడేందుకు మంచి అవకాశమే ఉన్నా మేం దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాం.  స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత మా బ్యాటింగ్ దారుణంగా దెబ్బతింది...’అని చెప్పాడు.  కాగా నిన్నటి మ్యాచ్ లో  23 కే రెండు వికెట్లు కోల్పోయిన లక్నోను  కృనాల్ తో కలిసి  స్టోయినిస్ ఆదుకున్నాడు.  ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 46 పరుగులు జోడించారు.   

56

కానీ పీయూష్ చావ్లా వేసిన  9వ ఓవర్లో  కృనాల్ భారీ షాట్ ఆడబోయి లాంగాన్ లో టిమ్ డేవిడ్  చేతికి చిక్కాడు.  దీంతో లక్నో వికెట్ల పతనం మొదలైంది. ఆ మరుసటి ఓవర్లోనే  బదోని, పూరన్ లు నిష్క్రమించడం.. ఆ తర్వాత  స్టోయినిస్, గౌతమ్,  దీపక్ హుడాలు   రనౌట్లు అవడంతో   ఈ మ్యాచ్ లో లక్నో  విజయావకాశాలు దెబ్బతిన్నాయి. 

66

కాగా ఈ మ్యాచ్ లో   లక్నో వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ను కాకుండా   ఫామ్ లో లేని కైల్ మేయర్స్ ను  ఆడించడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై కృనాల్ మాట్లాడుతూ.. మేయర్స్ కు చెన్నైలో మెరుగైన రికార్డు ఉందని.. అందుకే డికాక్ ను పక్కనబెట్టి  అతడిని ఆడించామని తెలిపాడు. 

click me!

Recommended Stories