మధ్వాల్ దెబ్బకు 68-2 తో పటిష్ట స్థితిలో నిలిచిన లక్నో.. 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ బంతిని ఇచ్చిన ప్రతీ ఓవర్లో మధ్వాల్ వికెట్ తీసి ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. ప్రేరక్ మన్కడ్, అయుష్ బదోని, నికోలస్ పూరన్ వంటి స్టార్ బ్యాటర్లతో పాటు రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్ లు కూడా మధ్వాల్ బౌలింగ్ లోనే వెనుదిరిగారు.