ఐపీఎల్ వల్ల మాకు బొక్క పడుతోంది, ఆపేయండి సార్... ఐసీసీకి పీసీబీ ప్రతిపాదన...

Published : Jun 16, 2022, 03:52 PM IST

ఐపీఎల్‌... ప్రపంచంలో అత్యంత ఖరీదైన క్రీడా టోర్నీల్లో ఒకటి. అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్‌ఎఫ్‌సీ) తర్వాత ఖరీదైన క్రీడా సమయం ఇండియన్ ప్రీమియర్ లీగే... ఐపీఎల్ 2023-27 మీడియా ప్రసార హక్కుల విక్రయం ద్వారా రూ.48 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఖాతాలో వేసుకుంది బీసీసీఐ...

PREV
18
ఐపీఎల్ వల్ల మాకు బొక్క పడుతోంది, ఆపేయండి సార్... ఐసీసీకి పీసీబీ ప్రతిపాదన...

మీడియా హక్కుల ద్వారా  వచ్చిన నగదుతో ఐపీఎల్  ఆకాశాన్ని తాకింది. ప్రపంచంలోని రెండో అత్యంత ధనవంతమైన  స్పోర్ట్స్ లీగ్ గా నిలిచింది.  2023-27 కాలానికి గాను మీడియా రైట్స్ ద్వారా రూ. 48,390 కోట్లు సంపాదించింది బీసీసీఐ. 

28

ఇన్ని రోజులు ఐపీఎల్ కంటే మా పీఎస్‌ఎల్ గొప్ప అంటూ డబ్బా కొట్టుకుంటూ వచ్చిన పాక్ క్రికెట్ బోర్డుకి ఈ పరిణామం మింగుడు పడకుండా చేసేసింది. ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్ వాల్యూ 100 కోట్ల రూపాయలకు చేరగా, పాక్ సూపర్ లీగ్‌ మొత్తం టోర్నీ విలువ కూడా అంత ఉండదు...

38

మీడియా ప్రసార హక్కుల వేలానికి ముందు మాది టాప్! అంటూ పేలిన పాక్ మాజీ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్... ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. దీంతో ఐపీఎల్‌ని దెబ్బతీసేందుకు మార్గాలు వెతికే పనిలో పడింది పాక్ క్రికెట్ బోర్డు...

48
Image credit: PTI

ఐపీఎల్ కారణంగా దాదాపు రెండున్నర నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కి ఫుల్‌స్టాప్ పడుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, సౌతాఫ్రికా, వెస్టిండీస్ వంటి మిగిలిన జట్ల టాప్ ప్లేయర్లు అందరూ ఐపీఎల్ ఆడేందుకు ఇండియాకి వస్తారు...

58

టాప్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడడానికి వెళితే, మిగిలిన ప్లేయర్లతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం ఇష్టం లేక... రెండు నుంచి రెండున్నర నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కి బ్రేక్ ఇచ్చేస్తున్నాయి క్రికెట్ బోర్డులు. అయితే పాక్ క్రికెటర్లకు మాత్రం ఐపీఎల్‌లోకి ప్రవేశం లేకపోవడంతో వాళ్లు ఈ టైమ్‌లో లోకల్ టోర్నీలు నిర్వహించుకుంటూ, అచొచ్చిన జింబాబ్వే, ఐర్లాండ్, నెదర్లాండ్ వంటి టీమ్స్‌తో సిరీస్ ఆడుతూ గడిపేస్తున్నారు...

68
Image credit: PTI

వచ్చే ఏడాది నుంచి ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ (FTP) లో ఐపీఎల్‌ని కూడా అధికారికంగా భాగం చేయాలని ప్రయత్నిస్తున్నాం. రెండున్నర నెలల పాటు టాప్ ప్లేయర్లు అందరూ పాల్గొనడానికి ఎలాంటి అవాంతరాలు కలగకుండా చూసుకుంటాం... ఇప్పటికే చాలా బోర్డులతో ఈ విషయం గురించి చర్చించాం...’ అంటూ బీసీసీఐ సెక్రటరీ జై షా కామెంట్ చేశాడు...

78
Image credit: PTI

‘ప్రపంచంలో మిగిలిన లీగ్‌ల్లో మ్యాచులను తగ్గిస్తూ ఉంటే, ఐపీఎల్‌లో మాత్రం పెంచుతూ పోతున్నారు. రెండున్నర నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ని ఆపేయడం కరెక్ట్ కాదు. దీని వల్ల ద్వైపాక్షిక సిరీస్‌లపై ప్రభావం పడుతుంది...’ అంటూ కామెంట్ చేశారు పీసీబీ అధికారులు...

88

2008 ఆరంగ్రేట ఐపీఎల్ సీజన్‌లో షోయబ్ అక్తర్, షాహీదీ ఆఫ్రిదీ, షోయబ్ మాలిక్, మిస్బా వుల్ హక్, సోహైల్ తన్వీర్ వంటి ప్లేయర్లు పాల్గొన్నారు. అదే ఏడాది ముంబై పేలుళ్ల తర్వాత ఐపీఎల్‌లో పాక్ క్రికెటర్లు పాల్గొనడంపై నిషేధం విధించింది బీసీసీఐ...

click me!

Recommended Stories