ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు మెంటార్ గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్..తన జట్టులో ఆడే టీమిండియా పేసర్ అవేశ్ ఖాన్ పై ప్రశంసలు కురిపించాడు. అతడిలో చాలా ప్రతిభ దాగి ఉందని.. ఫాస్ట్ బౌలర్లకు ఉండాల్సిన లక్షణాలన్నీ అవేశ్ లో ఉన్నాయని గంభీర్ కొనియాడాడు. అయితే టీ20లు ఒక్కటే ఆడితే సరిపోదని, అన్ని ఫార్మాట్లలోనూ రాణించాలని అవేశ్ కు సూచించాడు.