బ్యాంక్ నోట్లు మారొచ్చేమో, వికెట్ల వెనక ధోనీ కీపింగ్ మాత్రం ఎప్పటికీ మారదు.. వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్...

First Published May 29, 2023, 8:54 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్ మ్యాచ్‌లో మాహీ మ్యాజిక్ మరోసారి కనిపించింది. 20 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌ని రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మెరుపు స్టంపౌట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ...
 

టీ20 క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి ఇది 300వ వికెట్. దినేశ్ కార్తీక్ 296 వికెట్లలో భాగం పంచుకోగా వృద్ధిమాన్ సాహా 174 వికెట్లలో భాగం పంచుకున్నాడు. సురేష్ రైనా 172, విరాట్ కోహ్లీ 170 వికెట్లలో (క్యాచ్, రనౌట్) భాగం పంచుకుని తర్వాతి స్థానాల్లో ఉన్నారు..
 

టీ20 క్రికెట్‌లో 300లకు పైగా వికెట్లలో భాగం పంచుకున్న రెండో ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్ టీ20 క్రికెట్‌లో 345 వికెట్లలో భాగం పంచుకుని టాప్‌లో ఉన్నాడు...

Latest Videos


Shubman Gill

‘వావ్! బ్యాక్ నోట్లను మార్చవచ్చేమో కానీ వికెట్ల వెనక మహేంద్ర సింగ్ ధోనీని ఎవ్వరూ రిప్లేస్ చేయలేరు. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఎమ్మెస్ ధోనీ స్పీడ్‌ని ఎవ్వరూ ఎప్పటికీ అందుకోలేరు...’ అంటూ ట్వీట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..

MS Dhoni

‘ఇప్పటికీ ఫాస్టెస్ట్ హ్యాండ్స్ ఇన్ ద గేమ్. ఇంక్రీడబుల్. నిర్ఘాంతపోయేలా చేస్తున్నాడు. ఎంఎస్‌డీ నుంచి ఇది స్టన్నింగ్ స్టంపింగ్...’ అంటూ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు..

‘MSD మెరుపు వేగాన్ని చూశా. ఆయన్ని ఎవ్వరైనా ప్రేమించాల్సిందే’ అంటూ రాబిన్ ఊతప్ప ట్వీట్ చేయగా... ‘ఇది మాహీ స్పెషల్. ఆ చేతులు మెరుపు వేగాన్ని అందుకున్నాయి...’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. 

click me!