నాలుగింట్లో మూడు సార్లు ఓటమి... అయినా అదే నిర్ణయం తీసుకున్న ధోనీ! ఎక్కడో తేడా కొడుతోందే...

First Published May 29, 2023, 8:02 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే గత రికార్డులు చూస్తే, చెన్నైకి వ్యతిరేకంగా ఉండడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు..

MS Dhoni

ఐపీఎల్‌ చరిత్రలో 10 సార్లు ఫైనల్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్, ఇంతకుముందు నాలుగు సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసింది. అయితే ఇందులో మూడు సార్లు సీఎస్‌కేకి పరాజయమే ఎదురైంది....

2013, 2015, 2019 సీజన్లలో ముంబై ఇండియన్స్ చేతుల్లో లక్ష్యఛేదనలో విఫలమైంది చెన్నై సూపర్ కింగ్స్. 2019 ఫైనల్ మ్యాచ్‌లో 150 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో 148 పరుగులు మాత్రమే చేసి ఒక్క పరుగు తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది మాహీ టీమ్...
 

2013లో 149 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 125 పరుగులే చేయగా 2015 ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 202 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ టార్గెట్‌తో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 161 పరుగులు మాత్రమే చేసి 41 పరుగుల తేడాతో ఓడింది.. 

రెండేళ్ల బ్యాన్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌లో రెండోసారి బ్యాటింగ్ చేసి గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్... తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 178 పరుగులు చేయగా షేన్ వాట్సన్ అజేయ సెంచరీతో 117 పరుగులు చేయడంతో సీఎస్‌కేకి 8 వికెట్ల తేడాతో విజయం దక్కింది..

ఫైనల్‌లో సీఎస్‌కే ఛేదనలో ఓడిన మూడు సందర్భాల్లోనూ ప్రత్యర్థి ముంబై ఇండియన్సే. అయితే 2015, 2019 సీజన్లలో సీఎస్‌కేని ఫైనల్‌లో ఓడించిన ముంబై టీమ్‌లో ఉన్న హార్ధిక్ పాండ్యా ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్‌గా ఉన్నాడు...

2013, 2015 సీజన్లలో ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన అంబటి రాయుడు, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉండగా అప్పుడు సీఎస్‌కే తరుపున ఆడిన మోహిత్ శర్మ ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌లో ఉన్నాడు... 

click me!