విరాట్ కోహ్లీ రికార్డు సేఫ్! జోస్ బట్లర్‌ని దాటి అవుటైన శుబ్‌మన్ గిల్... ఆ విషయంలో కోహ్లీ కంటే...

First Published May 29, 2023, 8:20 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో శుబ్‌మన్ గిల్ పరుగుల ప్రవాహానికి ముగింపు కార్డు పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో 39 పరుగులు చేసి, స్టంపౌట్ అయ్యాడు శుబ్‌మన్ గిల్...

Shubman Gill

మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ 1 పరుగు వద్ద ఉన్నప్పుడు తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ని దీపక్ చాహార్ జారవిడిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ 2 పరుగుల వద్ద ఉన్నప్పుడు దేశ్‌పాండే బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ని చాహార్ జారవిడిచాడు..

ముంబై ఇండియన్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో టిమ్ డేవిడ్ క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత చెలరేగిపోయిన శుబ్‌మన్ గిల్ సెంచరీతో అదరగొట్టాడు. అయితే 20 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న శుబ్‌మన్ గిల్‌ని రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ధోనీ స్టంపౌట్ చేశాడు..

Latest Videos


శుబ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా కలిసి పవర్ ప్లేలో 62 పరుగులు చేశారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో పవర్ ప్లేలో వచ్చిన అత్యధిక స్కోరు ఇది. ఇంతకుముందు 2015 ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ 61 పరుగులు చేసింది. 2020లోనూ ఢిల్లీపై ముంబై 61 పరుగులే చేసింది..
 

శుబ్‌మన్ గిల్ ఈ సీజన్‌లో మొత్తంగా 890 పరుగులు చేసి, ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ తర్వాతి ప్లేస్‌లో నిలిచాడు. 2022 సీజన్‌లో 863 పరుగులు చేసిన జోస్ బట్లర్ రికార్డును అధిగమించిన శుబ్‌మన్ గిల్, 2016లో కోహ్లీ చేసిన 973 పరుగులకు 83 పరుగుల దూరంలో ఆగిపోయాడు..

Image credit: PTI

2023 సీజన్‌లో శుబ్‌మన్ గిల్‌కి ఇది 13వ 30+ స్కోరు. ఒకే సీజన్‌లో అత్యధిక సార్లు 30+ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు శుబ్‌మన్ గిల్. 2016లో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ 12 సార్లు 30+ స్కోర్లు చేయగా 2018 సీజన్‌లో కేన్ విలియంసన్ 12 సార్లు చేసి రెండో స్థానంలో ఉన్నారు.. 
 

Virat Kohli-Shubman Gill

ఐపీఎల్ 2023 సీజన్‌లో 118 బౌండరీలు బాదిన శుబ్‌మన్ గిల్, ఒకే సీజన్‌లో అత్యధిక బౌండరీలు బాదిన నాలుగో ప్లేయర్‌గా నిలిచాడు. 2022లో జోస్ బట్లర్ 128 బౌండరీలు బాదగా 2016లో విరాట్ కోహ్లీ 122, 2016లో డేవిడ్ వార్నర్ 119 బౌండరీలు బాదారు.. 

ప్లేఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు శుబ్‌మన్ గిల్. 2022 సీజన్‌లో జోస్ బట్లర్ ప్లేఆఫ్స్‌లో 234 పరుగులు చేయగా శుబ్‌మన్ గిల్ 210 పరుగులు చేశాడు. ప్లేఆఫ్స్‌లో ఒకే సీజన్‌లో 200లకు పైగా పరుగులు చేసిన బ్యాటర్లు ఈ ఇద్దరే...

MS Dhoni

2018 ఐపీఎల్ ఫైనల్‌లో ఆరెంజ్ క్యాప్ విన్నర్ కేన్ విలియంసన్‌ని ధోనీ స్టంపౌట్ చేశాడు. సరిగ్గా ఐదేళ్ల తర్వాత 2023 ఆరెంజ్ క్యాప్ విన్నర్ శుబ్‌మన్ గిల్‌ని కూడా ధోనీయే స్టంపౌట్ చేశాడు. ఐపీఎల్‌ ఫైనల్స్‌లో రెండు స్టంపౌట్లు చేసిన రెండో కీపర్‌గా ఉన్నాడు ధోనీ...  ఇంతకుముందు ఆడమ్ గిల్‌కిస్ట్, ఫైనల్స్‌లో రెండు సార్లు స్టంపౌట్లు చేశాడు.

click me!