టీమిండియా నుంచి పిలుపు వస్తుందన్న ఆశ లేదు! అప్పుడు చీప్‌గా చూసిన వాళ్లే, ఇప్పుడు... - రింకూ సింగ్

Published : May 21, 2023, 06:00 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన ప్లేయర్ రింకూ సింగ్. ఫాఫ్ డుప్లిసిస్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లు అదరగొట్టినా రింకూ సింగ్ డెత్ ఓవర్లలో ఆడిన ఇన్నింగ్స్‌లు వేరే లెవెల్...  

PREV
16
టీమిండియా నుంచి పిలుపు వస్తుందన్న ఆశ లేదు! అప్పుడు చీప్‌గా చూసిన వాళ్లే, ఇప్పుడు... - రింకూ సింగ్
Image credit: PTI

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 5 సిక్సర్లు బాది, అద్వితీయ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ని ముగించిన రింకూ సింగ్, లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 4 సిక్సర్లు, 6 ఫోర్లతో 67 పరుగులు చేసి అదరగొట్టాడు...
 

26
Image credit: PTI

ఆఖరి బంతికి 8 పరుగులు చేయాల్సిన సమయంలో కూడా లక్నో సూపర్ జెయింట్స్ డగౌట్‌లో గుబులు, టెన్షన్ కనిపించిందంటే దానికి కారణం క్రీజులో రింకూ సింగ్ ఉండడమే... టైటాన్స్‌పై రింకూ ఆడిన ఇన్నింగ్స్ గుర్తుకు తెచ్చుకుని బౌలర్ నో బాల్ వేసినా, వైడ్ వేసినా... మ్యాచ్ రిజల్ట్ మారిపోతుందనే భయమే...

36
Image credit: PTI

ఐపీఎల్ 2023 సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన రింకూ సింగ్ 149.52 స్ట్రైయిక్ రేటుతో 59.25 సగటుతో 474 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అదరగొట్టిన రింకూ సింగ్‌కి టీమిండియాలో చోటు దక్కుతుందని, దక్కి తీరాలని చాలామంది మాజీ క్రికెటర్లు ఆశాభావం వ్యక్తం చేశారు..
 

46
Image credit: PTI

‘గుజరాత్ టైటాన్స్‌పై 5 సిక్సర్లు కొట్టిన ఇన్నింగ్స్ ఇంకా నా మెదడులో కదులుతూ ఉంది. ఆఖరి ఓవర్‌లో కూడా కొట్టేయొచ్చని అనుకున్నా. చివరి ఓవర్‌లో 21 పరుగులు కావాలి. ఒక్క బాల్ మిస్ అయ్యా, అది ఫోర్ వెళ్లింది, లేదంటే మ్యాచ్ రిజల్ట్ మారిపోయేది..

56

ఈ సీజన్‌లో బాగా ఆడాననే ఆనందం మిగిలింది. టీమిండియా సెలక్షన్ గురించి ఆలోచించడం లేదు. ఇప్పట్లో సెలక్టర్ల నుంచి పిలుపు వస్తుందన్న ఆశలేదు. ఐపీఎల్ అయిపోయింది కాబట్టి దేశవాళీ టోర్నీలపై దృష్టి పెట్టాలి, ప్రాక్టీస్ మొదలెట్టాలి. నేమ్, ఫేమ్ వస్తాయి పోతాయి, అయితే పని ఆపలేం కదా...

66

ఈ సీజన్‌లో నేను ఆడిన ఆటకి ఇంట్లోవాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మ్యాచుల్లో బాగా వర్కవుట్ అయ్యింది. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి ఇంకా ఎక్కువ మందికి తెలిసాను. ఐదు సిక్సర్ల ఇన్నింగ్స్ తర్వాత ఇంతకుముందు చీప్‌గా చూసిన చాలామంది, ఇప్పుడు గౌరవిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది..’ అంటూ కామెంట్ చేశాడు కేకేఆర్ ప్లేయర్ రింకూ సింగ్.. 

 

click me!

Recommended Stories