ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 4 విజయాలు మాత్రమే అందుకుని 9వ స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ఈసారి టాప్ 2లో నిలిచి గుజరాత్ టైటాన్స్‌తో మొదటి క్వాలిఫైయర్ ఆడనుంది..
అట్టర్ ఫ్లాప్ సీజన్ తర్వాత రూ.16 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన బెన్ స్టోక్స్ తీవ్రంగా నిరాశపరిచినా 20 ఏళ్ల శ్రీలంక యంగ్ బౌలర్ మతీశ పథిరాణా అద్బుత బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు..
27
Image credit: PTI
2023 సీజన్‌లో 10 మ్యాచులు ఆడిన మతీశ పథిరాణా, 7.57 ఎకానమీతో 15 వికెట్లు తీశాడు. లంక మాజీ బౌలర్ లసిత్ మలింగ బౌలింగ్ యాక్షన్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌కి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్‌గా మారాడు పథిరాణా..
37
Image credit: PTI
చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మతీశ పథిరాణా, ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను సంపాదించుకున్న శ్రీలంక క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.. పథిరాణాకి ప్రస్తుతం ఇన్‌స్టాలో 446 వేల ఫాలోవర్లు ఉన్నారు...
47
శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగర్కరకి 348 వేల ఫాలోవర్లు ఉండగా, మరో మాజీ సారథి మహేళ జయవర్థనేకి 327 వేల ఫాలోవర్లు ఉన్నారు. లంక లెజెండరీ పేసర్ లసిత్ మలింగకి 317 వేల ఫాలోవర్లు ఉన్నారు..
57
Image credit: PTI
ఈ ముగ్గురినీ వెనక్కి నెట్టిన మతీశ పథిరాణా, ఆర్‌సీబీ తరుపున ఆడుతున్న ఆల్‌రౌండర్ వానిందు హసరంగ 386 వేల ఫాలోవర్ల రికార్డును కూడా అధిగమించి టాప్‌లో నిలిచాడు.
67
ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు 90 వేల కంటే తక్కువగా ఉన్న పథిరాణా ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య, నెలన్నరలో 3 వందల రెట్లు పెరగడం విశేషం..
77
కట్టుదిట్టమైన బౌలింగ్‌తో యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెడుతూ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసలు అందుకున్న మతీశ పథిరాణా, శ్రీలంక జట్టుకి ఫ్యూచర్ మలింగ అవుతాడని ఆశలు రేపుతున్నాడు.