బెంగళూరులో భారీ వర్షం... ఆర్‌సీబీని వెంటాడుతున్న బ్యాడ్‌లక్, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ రద్దు అయితే...

Published : May 21, 2023, 04:29 PM ISTUpdated : May 21, 2023, 04:33 PM IST

2020 సీజన్ నుంచి వరుసగా మూడు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ 2023 సీజన్‌లో కూడా ప్రస్తుతానికి నాలుగో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ, ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుకుంటుంది..

PREV
17
బెంగళూరులో భారీ వర్షం... ఆర్‌సీబీని వెంటాడుతున్న బ్యాడ్‌లక్, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ రద్దు అయితే...
RCB vs GT

డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌‌తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆఖరి లీగ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే 18 పాయింట్లతో టాప్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్, ఈ మ్యాచ్‌‌లో గెలిచినా, ఓడినా ఎలాంటి నష్టం ఉండదు..

27

కాబట్టి ఆఖరి మ్యాచ్‌లో రషీద్ ఖాన్, శుబ్‌మన్ గిల్, హార్ధిక్ పాండ్యా లాంటి స్టార్లను రెస్ట్ ఇవ్వవచ్చని టాక్ వినబడింది. ఇదే జరిగితే ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్‌పై గెలవడం పెద్ద కష్టమేమీ కాదు..

37
Chinnaswamy Stadium Rain

అయితే అన్నీ బాగున్నా, అల్లుడి నోట్లో శని అన్నట్టు, ఆర్‌సీబీని మరోసారి బ్యాడ్ లక్‌ వెంటాడుతోంది. బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వర్షంతో చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్దయ్యింది...

47

అయితే అన్నీ బాగున్నా, అల్లుడి నోట్లో శని అన్నట్టు, ఆర్‌సీబీని మరోసారి బ్యాడ్ లక్‌ వెంటాడుతోంది. బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వర్షంతో చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్దయ్యింది...

57
ChinnaSwami Stadium Rain

మ్యాచ్ సమయానికి వర్షం ఆగినా, పిచ్ ఆటకు సిద్ధం కావడానికి చాలా సమయం పడుతుంది. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం మ్యాచ్ సజావుగా జరిగి పూర్తి అయ్యే అవకాశాలు లేవు.

67

ఈ మ్యాచ్ రద్దు అయితే ఆర్‌సీబీ ఖాతాలో ఓ పాయింట్ చేరుతుంది. 14 పాయింట్లతో ఉన్న ఆర్‌సీబీ 15 పాయింట్లకు చేరుకుంటుంది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఓడిస్తే 16 పాయింట్లకు చేరుకుంటుంది. దీంతో ముంబై ఇండియన్స్ టాప్ 4లో నిలిచి ప్లేఆఫ్స్‌కి వెళితే ఆర్‌సీబీ ఇంటిదారి పట్టకతప్పదు. 

77

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతుల్లో ముంబై ఇండియన్స్ ఓడిపోతే మాత్రం వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే వచ్చే అదనపు పాయింట్‌తో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది. అదే జరిగితే ఆర్‌సీబీ, లక్నో మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. 

click me!

Recommended Stories