సచిన్ కొడుకుగా కాదు, అర్జున్‌ని ఓ కుర్ర క్రికెటర్‌గానే చూడండి...ముంబై ఇండియన్స్‌కి మాజీ క్రికెటర్ సలహా...

First Published Apr 27, 2023, 4:46 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరుపున ఆరంగ్రేటం చేశాడు అర్జున్ టెండూల్కర్. రెండు సీజన్ల పాటు అర్జున్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టిన ముంబై, ఎట్టకేలకు ఈ సీజన్‌లో ఆడిస్తోంది. అయితే అతన్ని ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌లో కూడా పూర్తిగా వాడుకోలేదు...

అర్జున్ టెండూల్కర్ ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో కేవలం 2 ఓవర్ల కోటా మాత్రమే వేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సాహసం చేసి అర్జున్‌కి మూడో ఓవర్ ఇస్తే, అందులో ఏకంగా 31 పరుగులు ఇచ్చేశాడు...

PTI Photo) (PTI04_25_2023_000273B)

ఆ దెబ్బకి మళ్లీ అర్జున్ టెండూల్కర్‌తో మూడో ఓవర్ వేయించే ప్రయత్నాలు చేయలేదు రోహిత్ శర్మ. తాజాగా ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా, అర్జున్ టెండూల్కర్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...

Latest Videos


arjun tendulkar

‘గత సీజన్‌లో ఓ సారి జహీర్ ఖాన్‌తో మాట్లాడుతున్నప్పుడు అర్జున్ టెండూల్కర్ గురించి చెప్పాడు. అతను నెట్స్‌లో చూపిస్తున్న పట్టుదల, డెడికేషన్‌ గురించి స్పెషల్‌గా చెప్పాడు. అయితే సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండ్ కొడుకుగా చూస్తే అర్జున్ ఎప్పుడూ తక్కువగానే కనిపిస్తాడు...

PTI PhotoKunal Patil)(PTI04_22_2023_000465B)

సచిన్ కొడుకుగా కాకుండా అతన్ని ఓ యంగ్ క్రికెటర్‌గా మాత్రమే చూడాలి. అప్పుడే అతని ఆటలో మెరుగుదల కనిపిస్తుంది. టీ20 క్రికెట్‌లో సక్సెస్ అవ్వాలంటే చాలా స్కిల్స్ అవసరం. ఎలాంటి బౌలర్ అయినా కొన్నిసార్లు ధారాళంగా పరుగులు సమర్పించాల్సి ఉంటుంది..

Arjun Tendulkar

టీ20 క్రికెట్‌లో సక్సెస్ అయితే మిగిలిన ఫార్మాట్లలో ఆడేందుకు పాస్ దొరుకుతుంది. అది ప్రమోషన్ లాంటిదే. అతను ఇప్పటిదాకా ఆడింది మూడు నాలుగు మ్యాచులే.ఈ మ్యాచుల్లో పర్ఫామెన్స్ అతని సత్తాని డిసైడ్ చేసేయదు...

Image credit: PTI

మొదటి ఓవర్లు బౌలింగ్ చేయడం అంత తేలికైన విషయం కాదు. దానికి చాలా డెడికేషన్ కావాలి, ఏకాగ్రత ఉండాలి. కొంచెం లైన్ తప్పినా బ్యాటర్లు డామినేట్ చేస్తారు. స్వింగ్ రాబట్టడానికి అర్జున్ టెండూల్కర్ బాగా కష్టపడుతున్నాడు..
 

Image credit: PTI

యార్కర్లు వేయడానికి ట్రై చేస్తున్నాడు. అతని బౌలింగ్‌లో కొన్ని అద్భుతమైన యార్కర్లు కూడా పడ్డాయి. అతని స్కిల్స్‌పైన అర్జున్‌కి పూర్తి నమ్మకం ఉంది. కష్టపడేందుకు అతను సిద్ధంగా ఉన్నాడు...

రోహిత్ శర్మ బౌలర్లను వాడే విధానం అద్భుతంగా ఉంటుంది. అందుకే అర్జున్ టెండూల్కర్‌ని ఎలా వాడాలో అతనికంటే ఎవ్వరికీ బాగా తెలియదని నా అభిప్రాయం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అర్జున్‌కి ఆఖరి ఓవర్‌ రిస్కే...
 

కానీ అర్జున్‌పై రోహిత్ శర్మ నమ్మకం ఉంచాడు. ఒకవేళ ఆ మ్యాచ్ రిజల్ట్ తేడా కొట్టి ఉంటే రోహిత్ శర్మ కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది. సీనియర్ బౌలర్లు లేకపోయినా ముంబై ఇండియన్స్ అన్నీ టీమ్స్‌కి టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలుగుతోందంటే కారణం రోహిత్ కెప్టెన్సీయే..’ అంటూ కామెంట్ చేశాడు ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా.. 

click me!