సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం మరో ఐదుగురు ప్లేయర్లు...

Published : Apr 27, 2023, 03:43 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే 15 మందితో కూడిన జట్టును ప్రకటించిన బీసీసీఐ, తాజాగా ఫైనల్ మ్యాచ్ కోసం మరో ఐదుగురు స్టాండ్‌బై ప్లేయర్లను జత చేసింది...

PREV
16
సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం మరో ఐదుగురు ప్లేయర్లు...
Ajinkya Rahane

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా శ్రీకర్ భరత్‌ని ఎంపిక చేసిన బీసీసీఐ, 17 నెలల తర్వాత అజింకా రహానేకి పిలుపు నిచ్చింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇస్తున్న పర్ఫామెన్స్ కారణంగా అజింకా రహానే, టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు....

26

తాజాగా దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్‌తో పాటు నవ్‌దీప్ సైనీలను స్టాండ్ బై ప్లేయర్లుగా ఫైనల్‌ టీమ్‌లో చేర్చింది బీసీసీఐ. ఇషాన్ కిషన్‌ వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా టీమ్‌లోకి రాగా లండన్‌లో స్వింగ్ బౌలర్లకు అనుకూలిస్తుండడంతో నవ్‌దీప్ సైనీ, ముకేశ్ కుమార్‌లకు చోటు ఇచ్చారు...

36
PTI Photo/R Senthil Kumar)(PTI04_03_2023_000289B)

భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లోని ప్లేయర్లు గాయపడితే రిజర్వు ప్లేయర్లుగా సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్‌లను లండన్‌కి వెళ్లబోతున్నారు. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌‌కి ముందే టీమిండియా ప్లేయర్లు, ఇంగ్లాండ్‌కి బయలుదేరి వెళ్తారు. అక్కడ కౌంటీ టీమ్స్‌తో వార్మప్ మ్యాచులు ఆడతారు..

46
Image credit: PTI

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, కెఎల్ రాహుల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్,శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్,జయ్‌దేవ్ ఉనద్కట్...

రిజర్వు ప్లేయర్లు: సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనీ...

56
Navdeep Saini

స్టాండ్ బై ప్లేయర్లుగా ఫైనల్‌కి ఎంపికైన ప్లేయర్లలో ఒక్క నవ్‌దీప్ సైనీ మాత్రమే టెస్టు ఆరంగ్రేటం చేశాడు. ఆస్ట్రేలియా టూర్‌లో సిడ్నీ టెస్టులో ఆరంగ్రేటం చేసిన నవ్‌దీప్ సైనీ, బ్రిస్బేన్ టెస్టులో గాయపడి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు...

66

ఈ ఏడాదిలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో టెస్టు ఆరంగ్రేటం చేసిన శ్రీకర్ భరత్, ఐపీఎల్ 2023 సీజన్‌లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో భరత్‌ని ఆడిస్తారా? లేక కెఎల్ రాహుల్‌తో వికెట్ కీపింగ్ చేయిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.. 

click me!

Recommended Stories