అజింకా రహానే సెలక్షన్ వెనక ధోనీ!... మాహీని అడిగాకే డబ్ల్యూటీసీ ఫైనల్‌కి సెలక్ట్ చేసిన బీసీసీఐ...

First Published Apr 27, 2023, 4:07 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా అదరగొడుతున్న ప్లేయర్ అజింకా రహానే. టెస్టు స్పెషలిస్టు ప్లేయర్‌గా ముద్రపడి, వైట్ బాల్ క్రికెట్‌కి చాలా ఏళ్ల కిందట దూరమైన రహానే, 2023 సీజన్‌లో 180+ స్ట్రైయిక్ రేటుతో దుమ్ముదులుపుతున్నాడు...
 

Ajinkya Rahane

ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఎంపిక చేసిన జట్టులో అజింకా రహానేకి చోటు దక్కింది. 2021 జనవరిలో టీమిండియాలో చోటు కోల్పోయిన రహానేకి, 17 నెలల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే రహానే రీఎంట్రీ వెనక మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడట...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి టీమ్‌ని ఎంపిక చేసే సమయంలో సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఫోన్ చేసిన సెలక్టర్లు, అతని అభిప్రాయం తీసుకున్నాకే అజింకా రహానేని ఫైనల్ చేశారట. ఈ విషయాన్ని ఓ ఇంగ్లీష్ పత్రిక రాసుకొచ్చింది...
 

Latest Videos


ఇంతకుముందు 2021 టీ20 వరల్డ్ కప్‌ టోర్నీకి ఎంపిక చేసిన జట్టు విషయంలో కూడా ధోనీ జోక్యం చేసుకున్నాడు. ఆ టోర్నీకి మెంటర్‌గా ఎంపికైన ధోనీ, ఫామ్‌లో లేని హార్ధిక్ పాండ్యాకి టీమ్‌లో చోటు ఉండాల్సిందేనని సెలక్టర్లకు సూచించాడు. ఇది టీమ్‌ పర్ఫామెన్స్‌ని దెబ్బ తీసింది...

Ajinkya Rahane

అయితే ఇప్పుడు టీమిండియాకి అజింకా రహానే కాకుండా మరో ఆప్షన్ కూడా లేదు. శ్రేయాస్ అయ్యర్‌కి వెన్నెముక సర్జరీ ముగిసింది. అతను కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అలాగే సూర్యకుమార్ యాదవ్‌కి టెస్టు అనుభవం లేదు, వన్డేల్లో కూడా విఫలమవుతున్నాడు...

టెస్టుల్లో సుదీర్ఘమైన అనుభవంతో పాటు ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ టూర్లలో అదరగొట్టిన రికార్డు ఉన్న అజింకా రహానే అనుభవం టీమ్‌కి ఎంతో ఉపయోగపడుతుంది. సర్ఫరాజ్ ఖాన్‌, రుతురాజ్ గైక్వాడ్‌లకు టెస్టు అనుభవం లేదు, వారిని నేరుగా టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బరిలో దిగడం పెద్ద రిస్కే అవుతుంది.. 
 

Ajinkya Rahane

ముంబై ఇండియన్స్‌లో ఐపీఎల్ కెరీర్ మొదలెట్టి, ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టీమ్స్‌కి ఆడిన అజింకా రహానేని బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

Ajinkya Rahane

మొయిన్ ఆలీ గాయపడడంతో టీమ్‌లోకి వచ్చిన అజింకా రహానే, ముంబైతో మ్యాచ్‌లో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసిన రహానే.. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు..

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్ కెరీర్‌లో 162 మ్యాచులు ఆడిన అజింకా రహానే, 200+ స్ట్రైయిక్ రేటుతో ఆడిన రెండు మ్యాచులు కూడా ఈ సీజన్‌లోనే వచ్చాయి... సూపర్ ఫామ్‌లో ఉన్న రహానే, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఈ రేంజ్ పర్ఫామెన్స్ ఇస్తే చాలు... టీమిండియా మిడిల్ ఆర్డర్ కష్టాలు తీరినట్టే.. 

click me!