ఆ అరుపులకు నా చెవులు పోయాయి! ఫస్ట్ బాల్‌కే అవుట్ చేద్దామనుకున్నా... ధోనీ మానియాపై మార్క్ వుడ్...

First Published Apr 6, 2023, 5:39 PM IST

మిగిలిన క్రికెటర్లకు అభిమానులు ఉంటే, మహేంద్ర సింగ్ ధోనీకి మాత్రం భక్తులు ఉంటారు. ధోనీ కనిపిస్తే టీవీలకి హారతులు ఇచ్చేవాళ్లు, మాహీ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకోవడానికి ఆరాటపడేవాళ్లు, ఆఖరికి ఎమ్మెస్‌తో సెల్ఫీ తీసుకునే టైమ్‌లో చెప్పులు విప్పి ఫోటో దిగేవాళ్లు... ఇలా ఎందరో మరెందరో...
 

Image credit: PTI

19 ఏళ్లుగా క్రికెట్ ఫ్యాన్స్‌న ఊర్రూతలూగిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, 2023 ఐపీఎల్ సీజన్ తర్వాత పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరుగుతోంది. 2023 ఐపీఎల్‌ని మాహీకి ఫేర్‌వెల్ సీజన్‌గా ప్రచారం చేస్తున్నారు నిర్వాహాకులు...

Image credit: PTI

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో ఓ ఫోర్, ఓ సిక్సర్ కొట్టి అభిమానులను అలరించిన మహేంద్ర సింగ్ ధోనీ, సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది, అవుట్ అయ్యాడు...
 

Latest Videos


Dhoni-Mark Wood

మూడేళ్ల గ్యాప్ తర్వాత తొలిసారి చెపాక్ స్టేడియంలో మ్యాచ్ ఆడింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. క్రికెట్ అసోసియేషన్ కక్కుర్తిపడి వీఐపీల కోసం కేటాయించిన కొన్ని సీట్లు తప్ప... దాదాపు పూర్తి స్టేడియం ప్యాక్ అయిపోయింది..

dhoni gambhir

‘ధోనీని ఎలా అవుట్ చేయాలా? అని నేను, కెఎల్ రాహుల్ చాలాసేపు మాట్లాడుకుంటున్నాం. ధోనీని త్వరగా అవుట్ చేస్తే, సీఎస్‌కేపై మానసికంగా పైచేయి సాధించినట్టు అవుతుందని కెఎల్ రాహుల్ చెప్పాడు...
 

(PTI PhotoR Senthil Kumar)(PTI04_03_2023_000319B)

అయితే నేను మాత్రం డిఫెన్సివ్‌గా ఉండాలని అనుకోలేదు. నిజానికి మొదటి బంతికే ధోనీని అవుట్ చేసి, పెవిలియన్‌కి పంపించాలని అనుకున్నా. అయితే చూస్తుండగానే రెండు సిక్సర్లు బాదేశాడు. మొదటి సిక్సర్ నాకైతే పెద్దగా అనిపించలేదు కానీ రెండో సిక్సర్ చాలా మంచి షాట్...

MS Dhoni

నేను ఎక్కడైతే వేయాలనుకున్నానో కరెక్టుగా బంతి అక్కడే పడింది. నేను ఊహించినంత బౌన్స్ కూడా వచ్చింది. అయితే ఆ బంతిని అద్భుతంగా సిక్సర్‌గా మలిచి బౌండరీ బయట పడేశాడు మహీ... మాహీ వస్తుంటే వచ్చిన అరుపులు... ఆ కేకలు, గోల... నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి దృశ్యం చూడలేదు..

ధోనీ సిక్సర్లు కొడుతుంటే ఆ అరుపులకి నా చెవులు పగిలిపోయాయి. ఆ సౌండ్స్‌ని తట్టుకోలేక గట్టిగా చెవులు మూసుకున్నా. నేను కాస్త ఓవర్‌ కాన్ఫిడెంట్‌గా ధోనీని తక్కువ అంచనా వేశా. వెనక్కి చూసుకుంటే అదో అద్భుత అనుభవం...

MS Dhoni

తొలి మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన తర్వాత రెండో మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చా. అయితే మిడిల్ ఓవర్స్‌లో నా బౌలింగ్ సంతృప్తినిచ్చింది. 20ల్లో ఇలాంటివి సహజం. మొదటి 2 మ్యాచుల్లో 8 వికెట్లు తీశా.. మున్ముందు మరిన్ని వికెట్లు సాధించేందుకు ఏం చేయాలో ఫోకస్ పెడతా..’ అంటూ కామెంట్ చేశాడు లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మార్క్ వుడ్.. 

click me!