ఆర్‌సీబీ మ్యాచులు చూడకండి! సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ధోనీ ఫ్యాన్స్... కారణం ఏంటంటే...

First Published Apr 6, 2023, 4:57 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ ఘనంగా మొదలైంది. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి టీఆర్‌పీ కూడా బాగా పెరిగింది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ని దాదాపు 20 కోట్ల మంది వీక్షించినట్టు సమాచారం. అంటే పొరుగుదేశం పాకిస్తాన్ జనాభాతో సమానం...

Image credit: PTI

ఐపీఎల్ 2023 సీజన్ మొబైల్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న వయాకాం18 నెట్‌వర్క్, జియో సినిమా యాప్‌లో మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేస్తోంది. దీంతో మొబైల్ ద్వారా ఈ మ్యాచ్‌లను చూస్తున్నవారి సంఖ్య భారీగానే ఉంది...

Image credit: PTI

అలాగే స్టార్ స్పోర్ట్ నెట్‌వర్క్‌కి కూడా వచ్చిన నష్టమేమీ లేదు. మొబైల్ యాప్‌లు, స్మార్ట్ ఫోన్‌లలో మ్యాచ్‌లు చూస్తే, పెద్దగా మజా లేదనే భావించేవారంతా టీవీల్లో మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో గత సీజన్‌తో పోలిస్తే, టీఆర్‌పీ రేటింగ్స్ కూడా బాగానే ఉన్నాయి...

Latest Videos


మ్యాచులు పెరిగే కొద్దీ, ఐపీఎల్ ఆసక్తికరంగా మారుతుంది. దీంతో వ్యూయర్‌షిప్ పెరిగే అవకాశం ఉంది. అయితే అన్యూహ్యంగా కొందరు అభిమానులు మాత్రం ఆర్‌సీబీ ఆడే మ్యాచులు చూడవద్దని సోషల్ మీడియాలో ఓ వెరైటీ క్యాంపెయిన్ చేస్తున్నారు. దీనికి కారణం ధోనీ రికార్డును, ఎక్కడ కోహ్లీ ఫ్యాన్స్ లేపేస్తారేమోనని భయపడడమే...

(PTI PhotoR Senthil Kumar)(PTI04_03_2023_000321B)

ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాహీ బ్యాటింగ్‌కి వచ్చిన సమయంలో జియో సినిమా యాప్‌లో అత్యధికంగా రియల్‌టైం వ్యూస్ 1.7 మిలియన్లకు చేరాయి. అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో విరాట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 1.6 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి..
 

Image credit: PTI

విరాట్ కోహ్లీ 16 ఓవర్ల పాటు క్రీజులో ఉంటే ధోనీ మూడు బంతులు ఆడి 2 సిక్సర్లు కొట్టి అవుట్ అయ్యాడు. దీంతో ఈసారి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వస్తే, ధోనీ రికార్డు బ్రేక్ అవుతుందని భయపడుతున్న కొందరు మాహీ ఫ్యాన్స్... ‘ఆర్‌సీబీ మ్యాచ్‌లను బహిష్కరించండి’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు..

(PTI PhotoShailendra Bhojak)(PTI04_02_2023_000356B)

మాహీ ఫ్యాన్స్, ఆర్‌సీబీ మ్యాచ్‌లను చూడకపోతే ధోనీ రికార్డు అలాగే ఉంటుందని, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సమయంలో మరో కొత్త రికార్డు నెలకొల్పాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యేక్షం అయ్యాయి. ధోనీకి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. అయితే కోహ్లీకి అంతకుమించి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది.

Image credit: PTI

దీంతో ఈసారి కోహ్లీ వర్సెస్ ధోనీ వ్యూయర్‌షిప్ ఫైట్ రసరంజకంగా సాగనుందని తెలుస్తోంది. సాధారణంగా సినిమా హీరోల సినిమాలు, టీజర్, ట్రైలర్ వ్యూస్‌ రికార్డుల కొట్టుకునేవాళ్లు అభిమానులు. ఐపీఎల్ పుణ్యమాని ఈ పిచ్చి ఇప్పుడు క్రికెట్‌కి కూడా పాకేసింది..

click me!