సిమ్రాన్ హెట్మయర్ వంటి హిట్టర్ టీమ్‌లో ఉన్నా.. అతన్ని కాదని దేవ్‌దత్ పడిక్కల్, రియార్ పరాగ్‌లను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపిన రాజస్థాన్ రాయల్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. 18 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్, ఆఖరి ఓవర్ మూడో బంతికి అవుట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్, 5 పరుగుల తేడాతో ఓడింది..