Published : Apr 17, 2023, 09:15 AM ISTUpdated : Apr 17, 2023, 10:02 AM IST
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒక్క ఢిల్లీ క్యాపిటల్స్ తప్ప మిగిలిన అన్ని టీమ్స్ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తూ దూసుకుపోతున్నాయి. తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్, వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చి, తాము కూడా రేసులో ఉన్నామని ఘనంగా చాటింది...
కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో సునాయస విజయం అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా, ముంబై ఇండియన్స్ బౌలర్ హృతిక్ షోకీన్ గొడవ పడడం హాట్ టాపిక్ అయ్యింది...
26
10 బంతులు ఆడి 5 పరుగులే చేసిన నితీశ్ రాణా, హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి రమన్‌దీప్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ సమయంలో నిరాశగా పెవిలియన్‌కి వెళ్తున్న నితీశ్ రాణాని హృతిక్ షోకీన్ సెడ్జ్ చేశాడు..
36
దీనికి నితీశ్ రాణా కూడా ఘాటుగానే స్పందించి బూతులు తిట్టాడు. ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. అయితే అక్కడే ఉన్న సూర్యకుమార్ యాదవ్, పియూష్ చావ్లా... నితీశ్ రాణాని శాంతపరిచి పెవిలియన్‌కి పంపించారు. 19 వేల మంది అమ్మాయిలతో నిండిన స్టేడియంలో ఇలా బూతులు మాట్లాడడం, ఇలాంటి ప్రవర్తన కరెక్ట్ కాదని ముంబై ఇండియన్స్ యజమాని నీతూ అంబానీ వ్యాఖ్యానించింది..
46
గ్రౌండ్‌లో క్రమశిక్షణా నియమావళి ఆర్టికల్ 2.21 కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఉల్లంఘించినందుకు కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐపీఎల్ మేనేజ్‌మెంట్...
56
Image credit: PTI
అలాగే నితీశ్ రాణాని రెచ్చగొట్టి అతనితో గొడవ పడిన ముంబై ఇండియన్స్ బౌలర్ హృతిక్ షోకీన్‌కి కూడా జరిమానా పడింది. ఆర్టికల్ 2.5 నిబంధనను ఉల్లంఘించినందుకు హృతిక్ షోకీన్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోతపడనుంది.
66
PTI Photo/Ravi Choudhary)(PTI04_11_2023_000371B)
రోహిత్ శర్మ కడుపు నొప్పితో బాధపడుతుండడంతో కేకేఆర్‌తో మ్యాచ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్‌పై కూడా వేటు వేసింది బీసీసీఐ. స్లో ఓవర్ రేటు కారణంగా సూర్యకుమార్ యాదవ్ కి రూ.12 లక్షలు జరిమానా విధించింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్..