పెవిలియన్‌కి వెళ్తున్న విరాట్ కోహ్లీ, వెనక్కి వచ్చి కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్‌తో గొడవ పడ్డారు. ఈ ఇద్దరూ దాదాపు కొట్టుకునే స్థాయిలో వాగ్వాదం జరిగింది. మరో ఢిల్లీ క్రికెటర్ రజత్ భాటియా వచ్చి ఈ ఇద్దరినీ నిలువరించాడు. 10 సీజన్లు గడిచినా ఈ ఢిల్లీ బాయ్స్ గొడవని అటు విరాట్ కోహ్లీ కానీ, ఇటు గౌతమ్ గంభీర్ కానీ మరిచిపోలేదు.. ఈ ఇద్దరూ కూడా దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరుపున ఆడినవాళ్లే.