క్రికెట్ దేవుడి కొడుకంటే మాటలా... అర్జున్ టెండూల్కర్‌‌పై ట్రోల్ రాకుండా ముంబై ఇండియన్స్ అతి జాగ్రత్త...

Published : Apr 16, 2023, 06:46 PM IST

24 ఏళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగి, 100 సెంచరీలతో పాటు అనితర సాధ్యమైన రికార్డులెన్నో సృష్టించిన సచిన్ టెండూల్కర్‌‌ని చాలామంది ‘క్రికెట్ గాడ్’ అని పిలుస్తారు. అలాంటి లెజెండరీ క్రికెటర్ కొడుకు అయ్యుండి కూడా ఐపీఎల్ ఆరంగ్రేటం కోసం రెండేళ్లు ఎదురుచూశాడు అర్జున్ టెండూల్కర్‌...

PREV
18
క్రికెట్ దేవుడి కొడుకంటే మాటలా... అర్జున్ టెండూల్కర్‌‌పై ట్రోల్ రాకుండా ముంబై ఇండియన్స్ అతి జాగ్రత్త...

వాస్తవానికి అర్జున్ టెండూల్కర్, సచిన్ ఫ్యామిలీ నుంచి రాక పోయి ఉంటే ఇప్పటికి ఎప్పుడో ఐపీఎల్ ఆడేవాడు. లేదా ఐపీఎల్‌లో అమ్ముడుపోని ప్లేయర్ల లిస్టులో చేరిపోయేవాడు. సచిన్ టెండూల్కర్ కొడుకు కావడంతో అర్జున్ టెండూల్కర్‌ని చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తోంది ముంబై ఇండియన్స్...
 

28

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన అర్జున్ టెండూల్కర్‌కి ఏకంగా ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసే అవకాశం ఇచ్చాడు తాత్కాలిక సారథి సూర్యకుమార్ యాదవ్. తొలి ఓవర్‌లో 5 పరుగులు ఇచ్చి ఇంప్రెస్ చేసిన అర్జున్ టెండూల్కర్, ఆ తర్వాతి ఓవర్‌లో వెంకటేశ్ అయ్యర్ ఓ 4, 6 బాదడంతో 12 పరుగులు సమర్పించాడు..

38
Arjun Tendulkar


2009 ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్సీ చేసిన సచిన్ టెండూల్కర్, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటిసారి బౌలింగ్ చేసి 5 పరుగులు ఇచ్చాడు. 14 ఏళ్ల తర్వాత కేకేఆర్‌పైన, ముంబై ఇండియన్స్ తరుపునే ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన అర్జున్ టెండూల్కర్, తన తొలి ఓవర్‌లో 5 పరుగులే ఇవ్వడం విశేషం...

48

మొదటి రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత అర్జున్ టెండూల్కర్‌ని ఫీల్డింగ్ నుంచి తప్పించింది ముంబై ఇండియన్స్. అతని స్థానంలో రమన్‌దీప్ సింగ్ సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్‌కి వచ్చాడు. మొదటి 2 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చిన అర్జున్ టెండూల్కర్‌ని తిరిగి బౌలింగ్‌కి కూడా తీసుకురాలేదు ముంబై ఇండియన్స్...

58

రెండో ఓవర్‌లో 12 పరుగులు ఇవ్వడం, క్రీజులో ఉన్న వెంకటేశ్ అయ్యర్, రిలే మెడరిత్ వంటి సీనియర్ బౌలర్లను కూడా వదలకుండా చితక్కొడుతుండడంతో అర్జున్ టెండూల్కర్‌ని మళ్లీ బౌలింగ్‌కి తెస్తే ఏమవుతుందో గ్రహించిన ముంబై ఇండియన్స్... అతన్ని సైడ్ చేసేసింది..
 

68
Arjun Tendulkar

అంతేకాకుండా ముంబైలో అర్జున్ టెండూల్కర్ మొదటి ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు తండ్రి సచిన్ టెండూల్కర్, అక్క సారా కూడా వచ్చారు. ఆ ప్రెషర్‌లో అర్జున్ ఏదైనా క్యాచ్ మిస్ చేసినా, మిస్ ఫీల్డ్ చేసినా తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ‘బాబు గారు ఇక మీరు రెస్ట్ తీసుకోండి’ అన్నట్టుగా అతన్ని ఫీల్డింగ్ నుంచి తప్పించింది ముంబై ఇండియన్స్...

78
Image credit: Mumbai Indians/Facebook

సునీల్ గవాస్కర్ కొడుకు రోహాన్ గవాస్కర్, రోజర్ బిన్నీ కొడుకు స్టువర్ట్ బిన్నీ.. తండ్రి బాటలో నడిచి, టీమిండియాలోకి వచ్చారు. అయితే పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అందుకే అర్జున్ కెరీర్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్న సచిన్ టెండూల్కర్, తనపై విమర్శలు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు...

88

ప్రయత్నించి ఫెయిల్ అయితే ట్రోల్స్ రావడం కామన్... కానీ ట్రోల్స్ వస్తాయని ప్రయత్నించకుండా పక్కనబెడితే, అది కొడుకు టాలెంట్‌పై నమ్మకం లేకపోవడమే. అర్జున్ ఎంత బాగా ఆడినా సచిన్‌ని మ్యాచ్ చేయలేడు. అది అర్జున్ వల్లే కాదు, ఏ దేవుడి కొడుకు వల్ల కూడా కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. కాబట్టి అర్జున్‌పై ఇంత కేర్ తీసుకోవడం మానేస్తే బెటర్ అంటున్నారు ఫ్యాన్స్.. 

click me!

Recommended Stories