వరల్డ్ క్రికెట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రికీ పాంటింగ్‌కి భారత యంగ్ క్రికెటర్ పృథ్వీ షా అంటే ప్రత్యేకమైన అభిమానం. తన కెరీర్‌లో తాను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్రికెటర్లలో ఒకడిగా పృథ్వీ షాని చెప్పిన పాంటింగ్, వరుసగా విఫలమవుతున్నా అతనికి అవకాశాలు ఇస్తూ వచ్చాడు..
ఓపికకి కూడా ఓ హద్దు ఉంటుంది. శూన్యానికి కూడా ఎక్కడో ఓ దగ్గర ముగింపు ఉంటుంది. ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందు ఆరెంజ్ క్యాప్ ఈసారి మావోడే గెలుస్తాడని సంబరంగా చెప్పిన పృథ్వీ షా, ఇప్పుడు అతనిపై ఆశలు వదిలేసుకున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు...
27
‘ఐపీఎల్ లాంటి టోర్నీలో ప్రతీ మ్యాచ్ ఎంతో విలువైనది. అలాంటిది పృథ్వీ షాకి ఒకటికి ఆరు మ్యాచులు ఇచ్చాం. గత సీజన్‌లో ఆడిన ఆఖరి ఆడేడు మ్యాచుల్లో కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. అంటే 13 మ్యాచులుగా పృథ్వీ షా ఓపెనర్‌గా వస్తూ ఒక్క హాఫ్ సెంచరీ కొట్టలేదు..
37
టాపార్డర్‌లో మెరుపులు మెరిపించే బ్యాటర్లు కావాలి. ఒకటి కాకపోతే రెండో మ్యాచ్‌లో అయినా ఆడాలి. పృథ్వీ షా మ్యాచ్ విన్నరే. అందుకే అతన్ని రిటైన్ చేసుకున్నాం. అతను 30 బాల్స్ ఆడినా మేం ఆ మ్యాచులను ఈజీగా గెలిచేస్తాం.. అయితే ఇప్పటిదాకా అతను చేసింది 40 పరుగులే...
47
సీజన్‌లో 7-8 యావరేజ్‌తో ఓపెనర్ పరుగులు చేస్తుంటే ఆ టీమ్‌లో మిగిలిన ప్లేయర్లపై ఆ ఎఫెక్ట్ నెగిటివ్‌గా పడుతుంది. అందులో టీమ్‌లో ఉన్న మిగిలిన ప్లేయర్లకు కూడా అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.
57
ఫెయిల్ అవుతున్న పృథ్వీ షాకి కూడా బ్రేక్ అవసరం... రిజర్వు బెంచ్‌లో కూర్చున్న ప్లేయర్లు, ఇంతకంటే బెటర్‌గానే ఆడగలరు.. అందుకే అతన్ని పక్కనబెట్టాం..’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్...
67
సీజన్ ఆరంభానికి ముందు ఇదే రికీ పాంటింగ్, పృథ్వీ షాపై చాలా పాజిటివ్‌గా మాట్లాడాడు. ‘పృథ్వీషా ఇక్కడికి రావడానికి ముందు వారం రోజులు ఎన్‌సీఏలో ప్రాక్టీస్ చేసి వచ్చాడు. ఫిట్‌నెస్‌పై చాలా ఫోకస్ పెట్టాడు.
77
గతంతో పోలిస్తే నెట్స్‌లో చాలా కష్టపడుతున్నాడు. ఈసారి అతను ఆరెంజ్ క్యాప్ గెలుస్తాడని అనిపిస్తోంది...’ అంటూ వ్యాఖ్యానించాడు రికీ పాంటింగ్. అయితే హాఫ్ సీజన్ అయ్యేసరికి, పృథ్వీ షా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.