Rohit Sharma: ఈ రికార్డులు హిట్‌మ్యాన్‌కే సొంతం..

Published : Apr 29, 2023, 08:26 PM IST

Happy Birthday Rohit Sharma:  టీమిండియా సారథి రోహిత్ శర్మ  ఏప్రిల్ 30న 35 వ పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు.    ఈ నేపథ్యంలో  అతడు మాత్రమే సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం. 

PREV
16
Rohit Sharma: ఈ రికార్డులు హిట్‌మ్యాన్‌కే సొంతం..

భారత క్రికెట్ జట్టు  సారథి, అభిమానులు హిట్‌మ్యాన్ అని పిలుచుకునే  రోహిత్ శర్మ   రేపు (ఏప్రిల్ 30) 35వ ఏట అడుగుపెట్టబోతున్నాడు.   నాగ్‌పూర్ (మహారాష్ట్ర) కు చెందిన  రోహిత్.. పుట్టింది మాత్రం అమ్మమ్మగారి ఊరు విశాఖపట్నం లోనే.  భారత క్రికెట్ లో మరెవరికీ సాధ్యం కాని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఇక్కడ చూద్దాం. 

26

మూడు డబుల్ సెంచరీలు : వన్డే క్రికెట్ లో  సెంచరీ సాధించేందుకే  బ్యాటర్లు నానా తంటాలు పడుతుంటారు.  150 అయితే అద్భుతం. ఇక డబుల్ హండ్రెడ్ అయితే అది   కెరీర్ మొత్తంలో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే దొరికే అదృష్టం. అలాంటిది  రోహిత్ కు  మూడు డబుల్ సెంచరీలున్నాయి. 

36

2013 లో ఆస్ట్రేలియాతో  ఫస్ట్ డబుల్ సెంచరీ చేసిన  రోహిత్ శర్మ..    ఆ మరుసటి ఏడాదే శ్రీలంకపై కూడా ద్విశతకం సాధించాడు.  ఈ మ్యాచ్ లో  రోహిత్.. 264 పరుగులు చేశాడు. మూడో డబుల్ సెంచరీ శ్రీలంకపైనే సాధించాడు. 2017లో ఈ ఘనత అందుకున్నాడు. ప్రపంచ దిగ్గజ బ్యాటర్లు గా వెలుగొందుతున్న వారెందరో ఒక్కసారైనా చేయాలని కలలుకన్న దానిని హిట్‌మ్యాన్ ఏకంగా మూడు సార్లు సాధించాడు. 

46

వరల్డ్ కప్ లో ఐదు సెంచరీలు : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్  ఆరు వన్డే వరల్డ్ కప్ లు ఆడి  ఆరు సెంచరీలు సాధించాడు. కానీ  రోహిత్ మాత్రం రెండు వరల్డ్ కప్ లలోనే  ఐదు సెంచరీలు బాదాడు.  ఐసీసీ  ట్రోఫీలు అంటేనే  పూనకం వచ్చినట్టు ఊగిపోయే రోహిత్.. త్వరలో భారత్ లో జరుగనున్న వరల్డ్ కప్ లో ఆడి  రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ ట్రోఫీలో మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డును సమం చేస్తాడు. 

56

ఐపీఎల్ లో  ప్రస్తుతం భారత్ కు ఆడుతున్న  క్రికెటర్లలో మరే కెప్టెన్ కు లేని విధంగా ఈ లీగ్ లో  రోహిత్ కు ఐదు ట్రోఫీలున్నాయి.  మహేంద్ర సింగ్  ధోని కూడా నాలుగు  ట్రోఫీలతోనే ఉన్నాడు. తనతో పాటు జాతీయ జట్టుకు ఆడే  విరాట్ కోహ్లీ ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేదు. 

66

2013లో ముంబై  పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ ఆ ఏడాది ముంబైకి తొలి ఐపీఎల్  ట్రోఫీ అందించాడు.  ఆ తర్వాత 2015, 2017, 2019, 2020లలో  ముంబైని విజేతగా నిలిపాడు.  ఆటగాడిగా  రోహిత్ కు ఆరు ఐపీఎల్ ట్రోఫీలున్నాయి.  2009లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్.. ఆ ఏడాది  ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు. 

Read more Photos on
click me!

Recommended Stories