కోల్‌‘కథ’ ముగించిన విజయ్ శంకర్... టేబుల్ టాప్‌లోకి గుజరాత్ టైటాన్స్, ప్లేఆఫ్స్‌కి...

Published : Apr 29, 2023, 07:52 PM IST

ఐపీఎల్ 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, వరుసగా రెండో సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌కి చేరువైంది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం అందుకున్న గుజరాత్ టైటాన్స్, 8 మ్యాచుల్లో 6 విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. మిగిలిన 6 మ్యాచుల్లో సగం మ్యాచులు గెలిచినా మిగిలిన జట్లతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ చేరుకుంటుంది గుజరాత్ టైటాన్స్...

PREV
16
కోల్‌‘కథ’ ముగించిన విజయ్ శంకర్... టేబుల్ టాప్‌లోకి గుజరాత్ టైటాన్స్, ప్లేఆఫ్స్‌కి...

శుబ్‌మన్ గిల్ 1 పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నా, విజయ్ శంకర్ సిక్సర్ల మోత మోగించి కోల్‌‘కథ’ ముగించాడు. 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, రస్సెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

26
Image credit: PTI

20 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 35 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అవుట్ అయ్యాడు. సునీల్ నరైన్ బౌలింగ్‌లో రస్సెల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు గిల్...
 

36
(PTI Photo) (PTI04_09_2023_000205B)

18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్, రస్సెల్ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ని సుయాశ్ శర్మ జారవిడిచాడు. అయితే అప్పటిదాకా నెమ్మదిగా ఆడుతున్న విజయ్ శంకర్, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేసిన విజయ్ శంకర్, వరుణ్ చక్రవర్తి వేసిన 17వ ఓవర్‌లో 3 సిక్సర్లు బాది మ్యాచ్‌ని మలుపు తిప్పాడు. 

46
(PTI Photo/Swapan Mahapatra)(PTI04_14_2023_000342B)

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగుల స్కోరు చేసింది.  45 నిమిషాలు ఆలస్యంగా ఆట ప్రారంభమైంది. 15 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేసిన నారాయణ్ జగదీశన్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శార్దూల్ ఠాకూర్‌  4 బంతులాడి డకౌట్ అయ్యాడు..

56
Rahmanullah Gurbaz

39 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 81 పరుగులు చేసిన రెహ్మానుల్లా గుర్భాజ్, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. 20 బంతుల్లో ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన రింకూ సింగ్, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో జోషువా లిటిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

66

19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేసిన ఆండ్రే రస్సెల్, మహ్మద్ షమీ వేసిన ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి అవుట్ కాగా డేవిజ్ వీజ్ ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు తీయగా ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్, ఆఫ్ఘాన్ బౌలర్ నూర్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

click me!

Recommended Stories