మొదటిసారి చూసినప్పుడు వీడెవడో తింగరోడిలా ఉన్నాడని అనుకున్నా.. హార్ధిక్ పాండ్యాపై నటాశా కామెంట్స్...

Published : Apr 24, 2023, 07:50 PM IST

ముంబై ఇండియన్స్ టీమ్ ద్వారా భారత జట్టులోకి వచ్చి, ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి టైటిల్ గెలిపించి, టీమిండియా కెప్టెన్ అయిపోయాడు హార్ధిక్ పాండ్యా. టీమిండియా ఫ్యూచర్ వైట్ బాల్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా దాదాపు కన్ఫార్మ్ అయిపోయినట్టే...

PREV
110
మొదటిసారి చూసినప్పుడు వీడెవడో తింగరోడిలా ఉన్నాడని అనుకున్నా.. హార్ధిక్ పాండ్యాపై నటాశా కామెంట్స్...

హార్ధిక్ పాండ్యా, సెర్బియన్ మోడల్, డ్యాన్సర్ నటాశా స్టాంకోవిక్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నిశ్చితార్థం అయ్యాక ఓ బిడ్డకు జన్మనిచ్చిన నటాశా, ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా హార్ధక్ పాండ్యాని ‘మళ్లీ పెళ్లి’ చేసుకుంది...

210

రెండు మతాల సంప్రదాయాల్లో హార్ధిక్ పాండ్యా, నటాశా స్టాంకోవిక్ రెండో వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి తగలేసిన డబ్బేదో, కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకునేందుకు వాడితే బాగుంటుంది కదా అనే అనేక విమర్శలు కూడా వచ్చాయి...
 

310

నిరుపేద కుటుంబం నుంచి కోట్లకు అధిపతిగా మారిన హార్ధిక్ పాండ్యా లైఫ్ స్టైల్ వేరే రేంజ్‌లో ఉంటుంది. డాబు, దర్ఫం చూపించడానికి కోట్లు ఖరీదు చేసే బట్టలు, వాచీలు, నగలు వేసుకునే హార్ధిక్ పాండ్యా, భార్య బికినిలో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు..

410
Image Credit: Natasha Stankovic Instagram

అసలు హార్ధిక్ పాండ్యాకి నటాశా స్టాంకోవిక్‌కి ఎలా పరిచయం అయ్యింది. ఈ విషయాలను తాజాగా బయటపెట్టింది బాలీవుడ్ నటి, సెర్బియన్ డ్యాన్సర్ నటాశా. ‘నేను నా ఫ్రెండ్స్‌తో కలిసి ఓ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీకి వెళ్లాను. అతను హార్ధిక్ పాండ్యాకి కూడా కామన్ ఫ్రెండ్.. 

510
Image Credit: Natasha Stankovic Instagram

అతను ఓ విచిత్రమైన టోపీ పెట్టుకుని, ఏదో రకమైన షవల్ వేసుకుని అటు ఇటూ తిరుగుతూ కనిపించాడు. మొదటిసారి చూసినప్పుడు వీడెవడో తింగరోడిలా ఉన్నాడే అనుకున్నా. నేను ఇండియాకి చాలా సార్లు వచ్చాను. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా...

610
Image Credit: Natasha Stankovic Instagram

అయితే ఎప్పుడూ కూడా హార్ధిక్ పాండ్యా లాంటి వ్యక్తిని చూడలేదు. అసలు ఎవడీడు? ఎందుకు ఇలా తిక్కతిక్కగా చేస్తున్నాడని అనుకున్నా.. ఎవరినైనా మొదటిసారి కలిసినప్పుడు సాధారణంగా హ్యాండ్ షేక్ ఇస్తాం...

710

అయితే అతను మాత్రం నేరుగా హగ్ ఇచ్చేశాడు. అతను పేరు కూడా తెలీదు, ఎవరో తెలీదు. వచ్చి చాలా ఫ్రెండ్లీగా హగ్ ఇచ్చేశాడు. ఆశ్చర్యమేసింది. ఆ చిత్రమైన పరిచయమే ఇక్కడిదాకా తీసుకొచ్చింది...’ అంటూ కామెంట్ చేసింది నటాశా స్టాంకోవిక్...
 

810

‘ఆ పార్టీకి నటాశా మరో ఇద్దరు అమ్మాయిలతో కలిసి వచ్చింది. ఆ ముగ్గురిలో ఈమె చాలా హాట్‌గా కనిపించింది. నేను టేబుల్ మీద కూర్చోగానే తనతో మాట్లాడడానికి ప్రయత్నించా... తను మాత్రం నాతో కళ్లు కలపడానికే భయపడింది. అక్కడే మొదటిసారి పడిపోయా...’ అంటూ చెప్పుకొచ్చాడు హర్ధిక్ పాండ్యా...
 

910

‘తనని కలిసి మొదటిరోజు నుంచి హార్ధిక్ పాండ్యా, ఏదీ దాచకుండా అన్నీ నాతో పంచుకున్నాడు. తప్పు చేశానని చెప్పడానికి కూడా సిగ్గు పడలేదు. ఆ నిజాయితీయే నాకు బాగా నచ్చింది.

1010

అతను టీమిండియా క్రికెటర్ అని తెలియడానికి చాలా సమయమే పట్టింది...’ అంటూ తమ వెడ్డింగ్ వీడియో టీజర్‌లో చెప్పుకొచ్చింది హార్ధిక్ పాండ్యా భార్య నటాశా స్టాంకోవిక్.

click me!

Recommended Stories