టైటిల్ ఫెవరెట్‌గా కనిపించి, అప్పుడే చిత్తుచిత్తుగా ఓడుతూ... ప్రతీ మ్యాచ్‌లోనూ టీమ్‌ని మారుస్తున్న కేకేఆర్...

Published : Apr 24, 2023, 06:32 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ ఆరంభంలో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌పై పెద్దగా అంచనాలు లేవు. అనుకున్నట్టే మొదటి పంజాబ్ కింగ్స్ చేతుల్లో చిత్తుగా ఓడింది కేకేఆర్. అయితే ఆ తర్వాత కోల్‌కత్తా ఊహించని విధంగా రెండు అదిరిపోయే విజయాలు అందుకుని, సూపర్ స్ట్రాంగ్ టీమ్‌లా కనిపించింది..  

PREV
19
టైటిల్ ఫెవరెట్‌గా కనిపించి, అప్పుడే చిత్తుచిత్తుగా ఓడుతూ... ప్రతీ మ్యాచ్‌లోనూ టీమ్‌ని మారుస్తున్న కేకేఆర్...
PTI Photo/Vijay Verma) (PTI04_20_2023_000479B)

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోవడంతో 81 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రింకూ సింగ్ విశ్వరూపం చూపించాడు...

29
Image credit: PTI

వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్ కలిసి కేకేఆర్‌ని దాదాపు విజయతీరాలకు చేర్చారు. అయితే హ్యాట్రిక్ తీసిన రషీద్ ఖాన్ మ్యాచ్‌ని మలుపు తిప్పాడు. ఆఖరి ఓవర్‌లో 29 పరుగులు కావాల్సి రావడంతో గుజరాత్ టైటాన్స్‌దే మ్యాచ్ అనుకున్నారంతా...

39

అయితే ఊహించని విధంగా, ఐదుకి ఐదు సిక్సర్లతో మ్యాచ్‌ని అద్వితీయ ముగింపు పలికాడు రింకూ సింగ్. ఈ రెండు మ్యాచ్‌లతో కేకేఆర్, ఒక్కసారిగా ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ ఫెవరెట్లలో ఒకటిగా అనిపించింది..
 

49
PTI Photo/Swapan Mahapatra)(PTI04_14_2023_000342B)

ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఛేదనలో 200+ స్కోరు చేసి, 23 పరుగుల తేడాతో పోరాడి ఓడిన కేకేఆర్, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ సెంచరీ చేసినా 5 వికెట్ల తేడాతో ఓడింది. ఇప్పటిదాకా బాగానే ఉన్నా, ఆ తర్వాత కేకేఆర్ ఆటతీరు పూర్తిగా పడిపోయింది..

59

వరుసగా 5 మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 127 పరుగులకే ఆలౌట్ అయ్యి, 4 వికెట్ల తేడాతో ఓడిన కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది...
 

69
PTI Photo)(PTI04_09_2023_000322B)

ఇప్పటిదాకా 7 మ్యాచులు ఆడిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, దాదాపు ప్రతీ మ్యాచ్‌లో ఓ కొత్త ఓపెనింగ్ కాంబినేషన్‌ని పంపించింది. మొదటి మ్యాచ్‌లో మన్‌దీప్ సింగ్, రెహ్మనుల్లా గుర్బాజ్ ఓపెనర్లుగా రాగా, ఆ తర్వాతి మ్యాచ్‌లో గుర్భాజ్‌తో కలిసి వెంకటేశ్ అయ్యర్ ఓపెనింగ్ చేశాడు...

79
Image credit: PTI

టైటాన్స్‌తో మ్యాచ్‌లో గుర్భాజ్‌తో కలిసి నారాయణ్ జగదీశన్ ఓపెనింగ్ చేస్తే, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో జాసన్ రాయ్, లిటన్ దాస్ ఓపెనర్లుగా వచ్చారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో నారాయణ్ జగదీశన్‌తో సునీల్ నరైన్ ఓపెనింగ్‌కి వచ్చాడు...
 

89
PTI Photo/Vijay Verma) (PTI04_20_2023_000412B)

చెన్నై సూపర్ కింగ్స్, ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ వంటి టీమ్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటే... కేకేఆర్ మాత్రం ప్రతీ మ్యాచ్‌లోనూ ఏదో ఒక మార్పు చేస్తోంది... 

99

లీగ్ ప్రారంభంలో పటిష్టంగా కనిపించిన కేకేఆర్ , ఇప్పుడు అసలు ప్లేఆఫ్స్ చేరుతుందా? అంటే అది అదృష్టం మీదే ఆధారపడి ఉంది. శ్రేయాస్ అయ్యర్ లేకపోవడంతో నితీశ్ రాణా కెప్టెన్సీలో అనుభవ లేమితో పాటు కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్ చేస్తున్న ప్రయోగాలు, టీమ్‌ని ఘోరంగా దెబ్బ తీస్తున్నాయి.. 

click me!

Recommended Stories