సచిన్‌కి కోపం వస్తే, ప్లేయర్లు ఎవ్వరూ దగ్గరికి వెళ్లరు... ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసిన యువరాజ్ సింగ్...

Published : Apr 24, 2023, 06:02 PM IST

క్రికెట్‌ ప్రపంచాన్ని రెండు దశాబ్దాలకు పైగా ఏలిన సచిన్ టెండూల్కర్, 50వ పుట్టినరోజు నేడు. కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్ నుంచి సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, ధోనీ కెప్టెన్సీలో ఆడిన సచిన్ టెండూల్కర్... 6 వన్డే వరల్డ్ కప్ టోర్నీలు ఆడాడు...

PREV
17
సచిన్‌కి కోపం వస్తే, ప్లేయర్లు ఎవ్వరూ దగ్గరికి వెళ్లరు... ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసిన యువరాజ్ సింగ్...

సచిన్ టెండూల్కర్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్న యంగ్ స్టర్స్‌లో యువరాజ్ సింగ్ కూడా ఒకడు. సచిన్‌ని ఎంతో అభిమానించే యువీ, ‘పాజీ’ అని పిలుస్తున్నాడు. టెండూల్కర్ 50వ పుట్టిన రోజు సందర్భంగా ‘మాస్టర్’ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు యువరాజ్ సింగ్...

27

‘సచిన్ టెండూల్కర్ చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే సచిన్‌తో ఏం మాట్లాడాలన్నా చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. ముఖ్యంగా ఆయన కోపంగా ఉంటే, మిగిలిన ప్లేయర్లు అందరూ దగ్గరికి వెళ్లడానికి భయపడతారు. ఆయన్ని అలా కొద్దిసేపు వదిలేయాలి. లేదంటే ఆ కోపానికి గురి కావాల్సి ఉంటుంది...

37

ఆయనకి ఎన్నో ఏళ్లుగా చూస్తున్నా. సచిన్ గొప్ప ఆటగాడిగా మారే కొద్ది మరింత వినయంగా ఉండేవారు. క్రికెట్ విషయానికి వస్తే ఆయన చాలా గొప్ప ఆర్టిస్ట్. ఆయన కంటే గొప్ప ఆర్టిస్ట్‌ని నేనైతే చూడలేదు. క్రికెట్ మాత్రమే కాదు, టేబుల్ టెన్నిస్‌లో కూడా సచిన్‌ని ఓడించడం చాలా కష్టం...

47
Sachin Tendulkar, Yuvraj Singh

టేబుల్ టెన్నిస్ ఆడేటప్పుడు సచిన్ టెండూల్కర్‌ని ఓడించడానికి ఎంతగానో ప్రయత్నించేవాడిని. అయితే సచిన్ మాత్రం ఈజీగా గెలిచేస్తారు. సచిన్‌ 50వ పుట్టినరోజు కోసం స్పెషల్ వీడియో చేద్దామని ఆయన్ని అడిగాను. ఆయన నవ్వేసి, ఇది నా 25వ బర్త్ డే అన్నారు...

57

నాకు ఆయన మెంటర్. అంతకంటే ఎక్కువే. ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత సచిన్ టెండూల్కర్‌ని ఎత్తుకుని సెలబ్రేట్ చేసుకున్నా. ఆయన 40వ బర్త్ డేకి విషెస్ తెలిపేందుకు చాలా దూరం ప్రయాణించి వెళ్లాను. సచిన్ లేకుండా నా జీవితం ఎలా ఉండేదో ఊహించుకోలేను...
 

67

2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో సచిన్ టెండూల్కర్ నాకు అండగా నిలబడి, మనోధైర్యం నింపారు. ఆయనంటే ఎందుకు అంత స్పెషల్ అంటే సచిన్ అందరినీ ఒకేలా పలకరిస్తాడు...

77

హ్యాపీ బర్త్ డే మాస్టర్... ఇది నీకు ప్రత్యేకమైన రోజు...’ అంటూ టెండూల్కర్ కోసం రూపొందించిన స్పెషల్ వీడియోలో పంచుకున్నాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్..

click me!

Recommended Stories